ఆ క్షణం.. నిజంగానే రాధిక భయపడింది

Update: 2016-05-02 08:03 GMT
ప్రస్తుతం ''ఫోబియా'' అనే సినిమాతో మనల్ని భయపెట్టడానికి ముందుకొస్తోంది.. బాలయ్య హీరోయిన్‌ రాధికా ఆప్టే. ఈ అమ్మడు బాలీవుడ్‌ విభిన్నచిత్రాలు చేసి బాగానే పేరు తెచ్చకుంటోంది. తన కొత్త సినిమాలో ఒక మానసిక రుగ్మత ఉన్న అమ్మాయికి నటిస్తోంది. అయితే ఇలాంటి ఫోబియాలు రియల్‌ లైఫ్‌ లో చూశావా అంటే.. వామ్మో ఒక రోజు అదే జరిగింది అనేసింది.

మామూలుగా తనకు ఎటువంటి భయం లేదు కాని.. ఒకరోజు రాత్రి 4 గంటల వరకు షూటింగ్‌ చేసి ఇంటికి వెళ్ళిందట రాధిక. ఆ సమయంలో తన పై ఫ్లోర్‌ ఫ్లాట్‌ లో ఎవరో టేబుళ్లు వంటి జరుపుతున్నారట. దానితో బర్ బర్ అని సౌండ్‌ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిందట. అయితే పక్కన తన భర్త కూడా ఉండటంతో అంతగా అప్సెట్‌ కాలేదు కాని.. లేకపోతే ఈ సినిమా మూడ్‌ లో ఉండీ ఉండీ తనకు నిజంగానే ఏదైనా ఫోబియా వచ్చేసేదేమో అంటోందీ అమ్మడు.

హారర్‌ సినిమాలకు షూటింగ్‌ చేస్తున్నప్పుడు హన్సిక.. తాప్సీ.. వంటి భామలు నిజంగా రియల్‌ లైఫ్‌ లో దెయ్యాలను ఎదుర్కొన్నట్లు ఫీలవ్వడం.. ఇలా రాధిక నిజాంగానే ఒక ఫోబియో కు గురవ్వడం.. బహుశా క్యారెక్టర్‌ లో టూ మచ్‌ ఇన్వాల్వ్‌ అయిపోతున్నారని చెప్పాలి.

Tags:    

Similar News