రాధికా.. అంత ఆవేదన ఎందుకమ్మా

Update: 2017-08-21 07:44 GMT
సినిమా రంగంలో ప్రతి నటికీ మరియు నటుడికి వారి వారి స్థాయినిబట్టి రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. ముఖ్యంగా హీరోలకు అయితే ఏ స్థాయిలో వేతనాన్ని పొందుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  కానీ ప్రస్తుత రోజుల్లో చాలా సినిమాలకు  హీరోలే ప్లస్ పాయింట్ అవుతుండడంతో వారి మార్కెట్ ను బట్టి చిత్రాలను తెరకెక్కిస్తూ వారికే అత్యున్నత హోదా కల్పిస్తున్నారని హీరోయిన్ రాధికా ఆప్తే కొన్ని కామెంట్స్ చేసింది.

రాధిక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమందంటే.. ప్రస్తుత రోజుల్లో హీరోలను చూస్తున్నట్టు ఇతర నటీనటులను చూడటం లేదని, ముఖ్యంగా హీరోయిన్స్ ఎంత కష్టపడుతున్నా వారికి హీరోల స్థాయిలో ఆదరణ దక్కడం లేదని చెప్పింది. ఆమె నటించిన చాలా సినిమాల్లో హీరోతో సమానంగా  కష్టపడినా హీరోకు ఇచ్చిన స్థాయిలో తనకు రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ..వాపోయింది. ఇదే తరహాలో తనతో క్లోజ్ గా ఉన్న మరో ముగ్గురు టాప్ హీరోయిన్స్ పరిస్థితీ కూడా నాలానే ఉందని చెప్పింది.  సల్మాన్ లాంటి సూపర్ స్టార్స్ తో నటిస్తున్న దీపికా పదుకొనె- ప్రియాంక చోప్రా వంటి వారిని యాక్టర్స్ గానే చూస్తున్నారని.. అంతే కాకుండా ప్రస్తుతం ఈ సినిమా వ్యవస్థలో  ఇది ఒక "ఫోబియా" లాగా ఉందని.. పబ్లిక్ కూడా హీరోయిన్స్ ను అదే స్థాయిలో చూడటానికి అలవాటుపడిపోయారని చెప్పుకొచ్చింది.

మరి రాధికా చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం కొంత ఆలోచించే తరహాలోనే ఉంది. కానీ హీరోయిన్స్ స్పెషల్ రోల్స్ చేస్తే వారికి కూడా ప్రేక్షకులు ఆదరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా లేడి ఓరియెంటెడ్ మూవీస్ తీసినప్పుడు వారికి సూపర్ స్టార్ మర్యాదలు కూడా ఇస్తున్నారు. బహుశా రాధికకు ఈ విషయం తెలియక అలా మాట్లాడిందని అంటున్నారు నెటిజన్లు.
Tags:    

Similar News