అప్పుడు సౌందర్య.. ఇప్పుడు రాధిక

Update: 2016-03-06 05:47 GMT
తమ వయస్సు కాదని.. ఒక 30 ఏళ్ళు పెంచేసుకుని కష్టపడటమంటే.. పెద్ద విషయమే. అదేనండి.. ఈ హీరోయిన్లు ఉన్నారే.. 30 లో ఉన్న భామలు 50 వయస్సు భామల్లా తలకు తెల్ల రంగు వేసుకొని యాక్ట్‌ చేయడం గురించే మనం మాట్టాడుతోంది.

ముఖ్యంగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ విషయానికొస్తే.. అప్పట్లో ''నరసింహా'' సినిమాలో ఈయన వైఫ్‌ గా నటించిన సౌందర్య.. తన వయస్సుకు మించిన పాత్రనే వేసింది. తలకు తెల్లరంగు వేసుకుని.. జుట్టు నెరిసిన మమ్మీలా నటించింది. సేమ్‌ టు సేమ్‌ ఇప్పుడే మళ్ళీ రజనీ వైఫ్‌ క్యారెక్టర్‌ ను అలాంటి లుక్‌ తోనే చేస్తోంది హీరోయిన్‌ రాధికా ఆప్టే. అమ్మడు ఈ సినిమాలో ముసలి డాన్‌ కబాలి వైఫ్‌ గా నటిస్తోంది. ఈమె కూడా సౌందర్య టైపులోనే ఉంది.

ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే.. రజనీ ప్రక్కన ఇలా ముసలి భామల రోల్‌ చేయడానికి హీరోయిన్లు అందరూ భలే రెడీగా ఉన్నారే అనుకుంటున్నారు. ఇకపోతే రజనీ భార్యలుగా నటించిన సౌందర్య అండ్‌ రాధికే కాదు.. రమ్యకృష్ణ కూడా నరసింహా సినిమాలో ముసలి భామ రోల్‌ చేసింది.
Tags:    

Similar News