సౌత్ అయితే పడుకోవాలన్న హీరోయిన్

Update: 2017-10-10 06:30 GMT
సౌత్ సినిమాలపై నార్త్ దాడి ఈ మధ్యన బాగానే ఎక్కువయింది. దక్షిణాది సినిమాల్లో నటించి నటిగా మారిన ఢిల్లీ భామ తాప్సీ పన్ను.. కె.రాఘవేంద్రరావు విషయంలో కామెంట్స్ తో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. సౌత్ సినిమాల్లో నటించిన ఉత్తరాది ట్యాలెంటెడ్ బ్యూటీ రాధికా ఆప్టే కూడా ఇప్పుడిదే చెబుతోంది. గతంలో కూడా ఈమె ఇలాంటి కామెంట్స్ చేసింది కానీ.. ఇప్పుడు మరింత 'ఓపెన్' గా ఆ కబుర్లను చెప్పింది.

క్యాస్టింగ్ కౌచ్ గురించిన ప్రశ్న ఇప్పుడు ప్రతీ హీరోయిన్ కు ఎదురవుతోంది. నగ్నంగా నటిస్తే.. అందులో ఆర్ట్ ఎంత ఉందనే సంగతి హాలీవుడ్ ని చూసి నేర్చుకోవాలని చెప్పే రాధికా ఆప్టే.. ఈ విషయంలో ఉత్తరాదిలో ఎలా ఉంటుందనే సంగతి మాత్రం చెప్పలేదు. కానీ డైరెక్టుగా సౌత్ సినిమాపై పడిపోయింది. 'దక్షిణాదిలో అయితే.. వాళ్లతో పడుకోవడం తప్పనిసరి అనే పరిస్థితి సృష్టించేస్తారు. కానీ ఇలాంటివేమీ నేనను పట్టించుకోను. అలా చేయకపోవడం కారణంగా.. నాకు ఏవైనా సినిమాలు మిస్ అయినాయేమో కూడా తెలీదు. క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ అంత సీరియస్ గా నా దగ్గరకు రాలేదు' అంటూ సెలవిచ్చించి  రాధికా ఆప్టే. గతంలో ఈమె ఓ పెద్ద నిర్మాతను కలవాలంటే.. అంతకు ముందు ఆ కలిపిన వ్యక్తి.. తనతో ఓ రాత్రి గడపాల్సిందిగా అడిగాడని చెప్పింది లెండి.
Tags:    

Similar News