సవాళ్లను ఎదుర్కోవడం .. ఛాలెంజ్ లు విసరడం.. ఇవి రెండూ రాధిక ఆప్టేకి కొత్తేమీ కాదు. కథానాయికల్లో బోల్డ్ బ్యూటీగా పాపులరైనా తనకంటూ ఓ విలక్షణ పంథా ఉందని నిరూపించింది. ఎంచుకునే స్క్రిప్టు.. ఓకే చెప్పే పాత్రలో బోల్డ్ యాటిట్యూడ్ వగైరా వగైరా తనకు మాత్రమే యూనిక్ అనాల్సిందే. అందుకే రాధిక ఏం చేసినా అదో హాట్ టాపిక్ గా మారుతుంది.
ప్రస్తుతం మరో బోల్డ్ ఎటెంప్ట్ తో అభిమానుల ముందుకు రాబోతోంది. ఈసారి ఏకంగా కెప్లెన్ సీట్లో కూచుని క్లాప్ ..రోల్ అంటూ ఒక టీమ్ తోనే పని చేయించుకుని ఔట్ పుట్ రాబట్టింది. తానే స్వయంగా ఓ కథను రాసి.. తనదైన శైలిలో దర్శకత్వం వహించింది. `స్లీప్ వాకర్స్` పేరుతో 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులకు ఈ లఘుచిత్రం ఆలోచనాత్మక సందేశాన్ని ఇస్తుంది. లలిత్- హనీ- అభిషేక్ దీనిని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
రక్త చరిత్ర- లెజెండ్ లాంటి టాలీవుడ్ చిత్రాల్లో నటించిన రాధిక ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైంది. అక్కడ ఓటీటీ వేదికపై తనో పాపులర్ స్టార్. పలు వెబ్ సిరీస్ లతోనూ సందడి చేయబోతోంది. అలాగే దర్శకురాలిగా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ కొత్త ట్రయల్ ఎంతవరకూ సఫలమవుతుందో చూడాలి.