మే 31న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగాల్సిన బాహుబలి ఆడియో ఫంక్షన్ అనూహ్యంగా వాయిదా పడిపోయింది. ఆపై రామోజీ ఫిలిం సిటీలో ఈ వేడుక చేయాలని చూశాడు రాజమౌళి. అందుకోసం కొంతవరకు ఏర్పాట్లు కూడా జరిగాయి. కానీ ఆ ఆలోచన కూడా పక్కనబెట్టేసి ఇప్పుడు తిరుపతికి షిఫ్ట్ అయిపోయారు. ఈ శనివారం తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండులో బాహుబలి ఆడియో వేడుక జరగడం ఖాయమే.
ఐతే తిరుపతిలోనే ఆడియో వేడుక నిర్వహించడానికి కారణాలేంటా అని చూస్తే.. ఇది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆలోచన అని తెలిసింది. ఇటీవలే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నిర్మాణంలో వస్తున్న సినిమా ఆడియో వేడుక తిరుపతిలో చేయాలని తలపోశారట.
రెండు రాష్ట్రాల్లోని ఇంకే ప్రాంతంలో చేసినా.. అది ఆంధ్రా ప్రాంతమనో, తెలంగాణ ప్రాంతమనో ముద్ర పడుతుంది. విజయవాడలోనో, వైజాగ్‌లోనో చేస్తే.. తెలంగాణ అభిమానులు రావడానికి అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. అదే తిరుపతి అయితే అందరిదీ. పనిలో పనిగా వెంకన్నను కూడా దర్శించుకోవచ్చని తెలంగాణ వాళ్లు కూడా అక్కడికి వెళ్లడానికి అభ్యంతరం చూపించరు. ప్రయాణ సౌకర్యాలు, వసతి విషయంలో సైతం తిరుపతి అయితే పెద్దగా ఇబ్బందులుండవు. తిరుపతికి చెందిన నిర్మాత, నాయకుడు ఎన్వీప్రసాద్ దగ్గరుండి భారీగా ఏర్పాట్లు చూసుకుంటారు. అందుకే అన్ని విధాలా ఆలోచించి తిరుపతిని బాహుబలి ఆడియో వేడుకకు వేదికను చేశారు. ఐతే ఆడియో వేడుక తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో అనేక ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా అభిమానులకు చేరువ కావడానికి ప్లాన్స్ రెడీగా ఉన్నాయి.