గత కొన్నేళ్లలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు జోరు బాగా తగ్గిపోయింది. ‘శ్రీరామదాసు’ ఆయనకు చివరి హిట్టు. ఆ తర్వాత పాండురంగడు.. షిరిడి సాయి చేదు అనుభవాల్ని మిగిల్చాయి. ‘ఇంటింటా అన్నమయ్య’ విడుదలకే నోచుకోలేదు. దీంతో ఇక రాఘవేంద్రుడు దర్శకత్వానికి సెలవిచ్చేసినట్లే అనుకున్నారు. కానీ చివరగా ఓ మంచి సినిమాను అందించి.. పెద్ద విజయాన్నందుకుని సినిమాల నుంచి నిష్క్రమించాలనుకున్నారాయన.
అందుకే నాగార్జునతో ‘ఓం నమో వేంకటేశాయ’ తీశారు. ఈ సినిమా తీస్తున్నపుడే చాలాసార్లు ఇదే తన చివరి సినిమా అని రాఘవేంద్రుడు చెప్పినట్లుగా నాగ్ తెలిపాడు. ఐతే ‘ఓం నమో..’ విడుదలకు సిద్ధమవుతున్న టైంలో మాత్రం రాఘవేంద్రుడు మళ్లీ పునరాలోచనలో పడ్డట్లు కనిపించింది. ఈ సినిమా ఫలితాన్ని బట్టి రిటైర్మెంట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకున్నారాయన. ఐతే ‘ఓ నమో..’ రాఘవేంద్రుడికి ఊహించని పరాజయాన్ని మిగిల్చింది. ఈ సినిమా ఫలితం చూసి ఆయన నిర్ఘాంతపోయినట్లు సన్నిహితులు చెబుతున్నారు. భక్తి సినిమాలకు డబ్బులు రావంటూ చాలా నైరాశ్యంతో మాట్లాడుతున్నారట ఆయన. ఈ పరిస్థితుల్లో రాఘవేంద్రుడు ఫ్రస్టేట్ అయి దర్శకత్వానికి సెలవిచ్చేస్తారా? లేక మళ్లీ తనేంటో రుజువు చేసుకునే ప్రయత్నంలో పడతాడా అన్నది ఆసక్తికరం.
‘ఓం నమో..’ మీద కాన్ఫిడెన్స్ వచ్చాక.. ఒక దశలో యాదగిరి గుట్ట నేపథ్యంలో ఒక సినిమా తీయాలని కూడా ఆయన ఆశపడ్డారు. కానీ ‘ఓం నమో..’ ఫలితం చూశాక దర్శకేంద్రుడు మళ్లీ కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఇంకో సినిమా తీయడమూ అంత చిన్న విషయం కాదు. ఇందుకు నిర్మాతలు రెడీగా ఉండాలి. బయ్యర్లు ముందుకు రావాలి. అన్నింటికీ మించి నాగ్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోను ఒప్పించాలి. మరి రాఘవేంద్రుడు ఏం చేస్తాడో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/