ఎలా పడినా, ఎక్కడ పడినా VD మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు..!

Update: 2022-11-25 09:44 GMT
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ "లైగర్" సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని భావించాడు. అయితే పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇది ఈ సినిమాలో భాగమైన అందరినీ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో దర్శక హీరోల కాంబోలోసెట్స్ మీదకి వచ్చిన 'JGM' ప్రాజెక్ట్ ని కూడా పక్కన పెట్టేసే పరిస్థితి ఏర్పడింది.

విజయ్ దేవరకొండ సైతం "లైగర్" ఫ్లాప్ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎప్పటిలాగే మీడియా ముందుకు వస్తున్నారు. అయితే ఈ పరాజయం ప్రభావం VD మీద ఏమాత్రం ఉండదని ఆయన స్నేహితులు, టాలీవుడ్ నటులు రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి చెబుతున్నారు.

తాజాగా ఏబీఎన్ రాధా కృష్ణ చాట్ షోలో రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ.. "ఇండస్ట్రీ అనేది రంగులరాట్నంలాగా చాలా ప్రమాదకరమైంది. ఎంత పైకి తీసుకెళ్తుందో.. అంత కిందకు దించుతుంది. 'లైగర్' విషయంలో విజయ్ దేవరకొండ తప్పేముంది? ఎక్కడికో వెళ్ళిపోయాడు.. టక్కున కిందికి రావాల్సి వచ్చింది. నేల మీదకి వచ్చినట్లు'' అని అన్నాడు.

దీనికి రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ.. "ఇప్పుడు ఇద్దరం కలిసి 'ఖుషి' సినిమా చేస్తున్నాం. సమంత గారికి ఒంట్లో బాగా లేకపోవడం వల్ల ప్రస్తుతానికి కొంచం హోల్డ్ లో వుంది. తదుపరి షెడ్యూల్ స్టార్ట్ అవ్వగానే వెళ్లి కలుస్తాను. ఈ మధ్యలో అయితే మేం మాట్లాడుకోలేదు. హి ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. ఏదైనా తట్టుకుంటాడు" అని అన్నాడు.

ఏదేమైనా అతను పర్సనల్ గా ఎఫెక్ట్ అవ్వడు. వెరీ వెరీ స్ర్టాంగ్. ఎలా పడినా.. ఎక్కడ పడినా విజయ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది అని రాహుల్ చెప్పాడు. అలానే విజయ్ దేవరకొండ గురించి ప్రియదర్శి మాట్లాడుతూ.. హిట్ అండ్ ఫ్లాప్ అనేవి మామూలే కదా.. అతను చాలా డిఫరెంట్ అంటూ కచ్చితంగా మళ్లీ హిట్టు కొడతాడనే ధీమా వ్యక్తం చేశారు.

విజయ్ సైతం తన పునరాగమనంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇటీవల ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్ళినా కంబ్యాక్ ఇవ్వాలి అన్నా అంటున్నారు.. తాను ఎక్కడికీ వెళ్లలేదని.. ఇక్కడే ఉన్నానని తనదైన శైలిలో చెప్పి అభిమానులను ఉత్సాహ పరిచాడు. అందరికీ మంచి రోజులు ఉంటాయి.. చెడు రోజులు ఉంటాయి. గొప్ప సినిమా తీసి మీ అందరిని ఎంటర్టైన్ చేస్తానని వాగ్దానం చేస్తున్నానని VD అన్నారు.

విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత తో కలిసి 'ఖుషీ' సినిమా చేస్తున్నాడు. దీంతో రౌడీ హీరో సాలిడ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి తో విజయ్'D ఓ మూవీ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News