పార్టీ మూడ్ లో శ్రీముఖి.. రాహుల్!

Update: 2019-12-07 09:26 GMT
రాజకీయాలలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని ఒక నానుడి.  ఇది మనం బిగ్ బాస్ హౌస్ మేట్స్ విషయంలో కూడా అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.  బిగ్ బాస్ లో ఉప్పు నిప్పుగా ఉన్న హౌస్ మేట్స్ బయటకు వచ్చిన తర్వాత మంచి ఫ్రెండ్స్ గా మారిపోవడం అందరినీ ఆకర్షిస్తోంది.

బిగ్ బాస్ సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. రన్నర్ అప్ శ్రీముఖి మధ్య హౌస్ లో ఎలాంటి రిలేషన్ ఉండేదో బిగ్ బాస్ చూసిన అందరికీ తెలుసు.  సీజన్ ముగిసిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ శ్రీముఖి తన ఫోన్ కాల్స్ తీయడం లేదని కూడా చెప్పుకొచ్చాడు. అయితే అదంతా ఇప్పుడు గతం.  రీసెంట్ గా ఈ బిగ్ బాస్ సీజన్ త్రీ గ్యాంగ్ కొందరు పార్టీ చేసుకున్నారు. డ్యాన్సులతో స్టేజిపై ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. వితిక షేర్ చేసిన ఈ వీడియోలో రాహుల్.. శ్రీముఖి.. వరుణ్.. వితిక అందరూ కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. రాహుల్ కూడా ఈ పార్టీలో శ్రీముఖితో కలిసి ఉన్న ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.   మరోవైపు  శ్రీముఖి కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రాహుల్ తో కలిసి ఉన్న ఒక సెల్ఫీని పోస్ట్ చేసి "గతం గతః! అసలు రిలేషన్ షిప్ ఇప్పుడు మొదలైంది!" అంటూ అభిమానులకు ఒక పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. 

శ్రీముఖి.. రాహుల్ మధ్య హౌస్ లో జరిగిన సంభాషణలను.. శ్రీముఖి ఛాలెంజిలను గుర్తు చేసుకున్న అభిమానులు ఇప్పుడు ఈ స్నేహం చూసి ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ కీచులాటలు అన్ని సమసిపోయాయి. ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్. అది సంగతి.

Tags:    

Similar News