వైఫ్ ను తిడుతున్నారని వాపోయిన రాహుల్

Update: 2019-08-08 08:35 GMT
సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఎప్పుడైతే #మీటూ ఉద్యమంలో తమ గళం విప్పుతున్న మహిళలకు మద్దతుగా నిలుస్తూ ఫైట్ చేయడం ప్రరంభించిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేసేవారి సంఖ్య పెరిగింది. విమర్శించేవారు కొందరైతే.. అసభ్యకరమైన భాషలో చిన్మయిని దూషించేవారు మరికొందరు. ఈ ద్వేషాన్ని చాలా రోజుల నుంచి భరిస్తోంది కానీ తాజాగా 'మన్మథుడు 2' చిత్రం ఆమెకు మరింతగా ఇబ్బందులను తెచ్చిపెట్టింది.

చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మన్మథుడు 2' కు సెన్సార్ వారు ఈమధ్య కొన్ని పదాలను మ్యూట్ చేయమని సూచించిన సంగతి తెలిసిందే.  సరిగ్గా ఈ అంశాన్ని చూపిస్తూ కొందరు నెటిజన్లు చిన్మయిని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారట.  కొందరు 'మన్మథుడు 2' లో మ్యూట్ చేసిన పదాలను చిన్మయిపై వాడుతూ తిడుతున్నారట. రాహుల్ రవీంద్రన్ ఈ ట్రోలింగ్ పై స్పందిస్తూ "అవును.. అందరూ నా భార్యను ట్రోల్  చేస్తున్నారు.. నిజానికి అది బూతులు తిట్టడం. కానీ మౌనంగా ఉండడం మంచిది.  సినిమా చూసిన తర్వాత ఆ పదాలు ఉన్నవి ఒకే సీన్లో అని.. అవి ఎందుకు ఉన్నాయనే విషయం వారికే తెలుస్తుంది. నా భార్య నన్ను చూసి ఎందుకు గర్వపడుతుందో అనే విషయం కూడా వారికి అర్థం అవుతుంది" అని ట్వీట్ చేశాడు.

భర్త ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ చిన్మయి "ఏవరికైతే ఈ అంశంతో సంబంధం ఉంటో వారందరికీ ఈ ట్వీట్.   పొద్దున నుంచి *** అని తిడుతున్న కొందరు సోషల్ మీడియా ప్రజలకు.  ఇలా మాట్లాడితే మీకు మీతో ఉన్నవారికి అసహ్యం. నాకు కాదు" అంటూ హేటర్లకు ఘాటు రిప్లై ఇచ్చింది.  ఈ సమాధానం తర్వాత.. చిన్మయిని బూతులు తిట్టినా నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశాడు.  ఇతరులు కూడా "కంప్లైంట్ ఇస్తే లేని పోని చిక్కులు వస్తాయి" అని అనుకున్నారేమో కానీ తమ బూతుపురాణాల ట్వీట్లను తొలగించారు.

    

Tags:    

Similar News