హీరోగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ లను దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. హీరోగా నటుడిగా వర్కౌట్ అవ్వడం లేదనే ఉద్దేశ్యంతో చివరకు దర్శకత్వం వైపు అడుగులు వేశాడు. అక్కినేని కాంపౌండ్ లో 'చిలసౌ' అనే సినిమాను చేశాడు. చిన్న చిత్రంగా రూపొందిన ఆ సినిమా సక్సెస్ ను దక్కించుకుంది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నాగార్జునతో ఒక సినిమాను చేసే అవకాశం దక్కించుకున్నాడు. 'మన్మధుడు 2' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాహుల్ ఘోర పరాభవంను మూట కట్టుకున్నాడు.
మన్మధుడు 2 వచ్చి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు రాహుల్ దర్శకుడిగా తదుపరి సినిమాను ప్రకటించలేదు. ఇటీవలే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో రాహుల్ ఒక సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన లైవ్ చాట్ ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెప్పాడు. ఆ సందర్బంగా నాగార్జున గారితో గతంలో మరో సినిమా చేస్తానంటూ చెప్పారు కదా అది ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించగా మన్మధుడు 2 ఎఫెక్ట్ ఇంకా ఉంది. అభిమానులు ఇప్పటికి కూడా తిట్టుకుంటున్నారు. ఇప్పట్లో నాగ్ సర్ తో సినిమా లేదు. ఆయన అభిమానులను సంతృప్తి పర్చగలను అనే నమ్మకం కలిగినప్పుడు తప్పకుండా చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి నాగ్ తో సినిమా అంటేనే కాస్త భయంగా ఉన్నట్లుగా రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చాడు.