'మన్మథుడు 2' రిలీజుకు ముందు ఎన్ని కబుర్లు చెప్పినా రిలీజ్ తర్వాత 'మన్మథుడు 2' ఎంతగా న్యూ ఏజ్ సినిమా అని ప్రమోట్ చేసుకున్నా ప్రేక్షకులు మాత్రం సినిమాను తిరస్కరించిన మాట వాస్తవం. సినిమాపై.. బూతు కంటెంట్ పై విమర్శలు కూడా వచ్చాయి. అక్కినేని నాగార్జున.. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సంగతేమో కానీ హీరోయిన్ రకుల్ కు మాత్రం ఇది భారీ షాకే. ఎందుకంటే టాలీవుడ్ లో ఆఫర్లు పూర్తిగా తగ్గిపోతున్న దశలో 'మన్మథుడు 2' విజయంపై ఎంతో నమ్మకం పెట్టుకుంది. కానీ ఫలితం మాత్రం రివర్స్ అయింది.
సినిమాలు ఫ్లాప్ కావడం సాధారణమే కానీ ఈ సినిమా ఫలితం రకుల్ కెరీర్ పై ప్రభావం చూపించేలానే కనిపిస్తోంది. సీనియర్ స్టార్ తో రోమాన్స్ చేయడంతో ఇకపై యంగ్ హీరోలు రకుల్ ను హీరోయిన్ గా తీసుకుంటారా అనేది అనుమానమే. అయితే ఈ పరిస్థితిని గమనించిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తన నెక్స్ట్ సినిమాలో రకుల్ కు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాడట. 'మన్మథుడు 2' తర్వాత రాహుల్ న్యాచురల్ స్టార్ నానితో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడట. ప్రస్తుతం రాహుల్ ఈ సినిమాకు స్క్రిప్ట్ తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్నాడట. ఈ సినిమాలో నాని సరసన రకుల్ తీసుకుందామనే ఆలోచనలో రాహుల్ ఉన్నాడట. నాని 'యస్' అంటే రకుల్ కు ఛాన్స్ దక్కినట్టే.
'మన్మథుడు' ఫ్లాప్ గా నిలిచినా అది ఎక్కువగా నాగార్జున ఖాతాలోనే పడిందని ఎక్కువమంది అభిప్రాయం. ఎందుకంటే రాహుల్ సొంత కథతో సినిమా చేసేందుకు సిద్ధమయితే నాగ్ అది కాదని.. రీమేక్ చేయాలని సూచించారు. రీమేక్ కథలో బూతు ఉండడంతో రాహుల్ మొదట ఒప్పుకోలేదని..అయితే నాగ్ కు నో చెప్పలేక ముందుకెళ్ళి బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలపడ్డాడనే టాక్ వినిపిస్తోంది.