అప్పుడు 'ట్యాక్సీవాలా' షూట్‌ మద్యలో ఆపేశాం

Update: 2018-11-23 06:55 GMT
ఎన్నో అనుమానాలు - మరెన్నో నెగటివ్‌ చర్చల మద్య విడుదలైన ‘ట్యాక్సీవాలా’ చిత్రం అనూహ్యంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం ఒక్క రోజు కలెక్షన్స్‌ తో బ్రేక్‌ ఈవెన్‌ దక్కించుకున్న ట్యాక్సీవాలా ప్రస్తుతం ఎదురు లేకుండా దూసుకు పోతుంది. భారీ లాభాల దిశగా ఈ చిత్రం సాగుతోంది. ఈ సమయంలో చిత్ర దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నాడు. నయనతార డోర సినిమాకు భయపడి మా చిత్రం సగం చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత నిలిపేయాలనుకున్నాం అన్నాడు.

దర్శకుడు సంకృత్యన్‌ మాట్లాడుతూ.. నయనతార మూవీ ‘డోర’ ఫస్ట్‌ లుక్‌ రాగానే అంతా షాక్‌ అయ్యాం. కారులో ఆత్మ కాన్సెప్ట్‌ తో మేము చేస్తున్న సినిమాకు డోర కాన్సెప్ట్‌ కు చాలా దగ్గర పోలిక ఉంటుందేమో అనుకున్నాం. అప్పటికి రెండు రోజులు షూటింగ్‌ ఆపేశాం. ఇక ట్రైలర్‌ వచ్చిన తర్వాత సినిమా సగంలో ఉండగానే నిలిపేశాం. ‘డోర’ విడుదలయ్యే వరకు మళ్లీ ట్యాక్సీవాలా మొదలు పెట్టవద్దని భావించాం. నేను సొంతంగా రాసుకున్న కథ వేరే సినిమాలో వస్తున్న నేపథ్యంలో డిప్రెషన్‌ లోకి వెళ్లి పోయాను.

‘డోర’ విడుదలైన మొదటి రోజే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాకు వెళ్లాను. సినిమా చూశాక ఊపిరి పీల్చుకున్నా. మొదటి సగంలో కథ కాస్త పోలినట్లుగా ఉన్నా - సెకండ్‌ హాఫ్‌ మొత్తం కూడా పూర్తి విరుద్దంగా ఉంది. దాంతో మళ్లీ మా సినిమా షూటింగ్‌ మొదలు పెట్టామని చెప్పుకొచ్చాడు. నయనరతా ‘డోర’ చిత్రం తమిళంలో మంచి టాక్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. సినిమా ప్రారంభించినప్పటి నుండి ఏదో ఒక సమస్యతోనే సహవాసం చేస్తూ వచ్చామని - చివరకు మంచి విజయాన్ని దక్కించుకోవడంతో యూనిట్‌ సభ్యులమంతా చాలా సంతోషంగా ఉన్నామని దర్శకుడు పేర్కొన్నాడు.

Tags:    

Similar News