ఫ్రెండు వెంగి ఓ ఇంటివాడ‌య్యాడు.. రాహుల్ ఇంకెపుడు?

Update: 2020-11-23 14:00 GMT
టాలీవుడ్ లో వ‌రుస పెళ్లి వేడుక‌లు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తున్నాయి. నిఖిల్ - నితిన్ - రానా - కాజ‌ల్ .. ఇలా ప్ర‌ముఖులంతా ఓ ఇంటివాళ్ల‌య్యారు.

లేటెస్టుగా ప్ర‌ముఖ లిరిసిస్ట్ శ్రీ‌మ‌ణి కూడా పెళ్లాడేశారు. ప‌దేళ్ల ప్రేమ‌కు పెళ్లితో శుభం కార్డ్ ఇచ్చాడు. ఇప్పుడు యువ సంగీత దర్శకుడు వెంగి ఓ ఇంటివాడయ్యాడు. ‍కరీంనగర్ లో బంధువులు.. స్నేహితుల సమక్షంలో వెంగి హిందూ సంప్ర‌దాయ విధానంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి సినీప‌రిశ్ర‌మ నుంచి ప‌లువురు సంగీత ద‌ర్శ‌కులు విచ్చేశారు. అలానే వెంగి ప్రియ‌త‌మ స్నేహితుడు `బిగ్ బాస్ -తెలుగు` విజేత రాహుల్ సిప్లిగంజ్ కూడా అటెండ‌య్యారు.

వెంగి- రాహుల్ రూమ్ మేట్స్. మంచి స్నేహితులుగా సుప‌రిచితం. ఆ ఇద్ద‌రూ ఒకేసారి టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. ఒక‌రు సంగీత ద‌ర్శ‌కుడిగా స్థిర‌ప‌డితే ఒక‌రు కీర‌వాణి ఆస్థానంలో గాయ‌కుడిగా రాణించారు. బిగ్ బాస్ విజేత అయ్యాక‌ గాయ‌కుడు రాహుల్ పెద్ద సెల‌బ్రిటీగా ఎదిగారు. హీరోగానూ న‌టిస్తున్నారు. సింగ‌ర్ కం మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా వెంగి ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తున్నారు. ఇప్ప‌టికే సుమారు 25 పైగా మీడియం బ‌డ్జెట్ సినిమాల‌కు సంగీతం అందించారు. అన్న‌ట్టు ఫ్రెండు వెంగి ఓ ఇంటివాడ‌య్యాడు? మ‌రి రాహుల్ పెళ్లెప్పుడు? అంటూ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. పున‌ర్న‌వితో రాహుల్ ప్రేమాయ‌ణం అటుపై స‌మంతా జూనియ‌ర్ అషుతోనూ లవ్వాయ‌ణం అంటూ గాసిప్స్ వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News