మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది. ఈ సినిమాలో తనయుడు రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించాలని చిరంజీవి కోరుకున్నారు. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ మహమ్మారి ప్రభావం వలన వాయిదా పడింది. కాగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ కోసం సింహాచలం గుడి నేపథ్యంలో పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేశారట. 'ఆచార్య' సినిమా మొత్తానికి అవుట్ డోర్ లో జరిగే షెడ్యూల్ ఇదొక్కటేనట. దీని కోసం సింహాచలం గుడి సెట్ కూడా వేశారట. సమ్మర్ లో ఈ షెడ్యూల్ పూర్తి చేస్తే తరువాత పడే వర్షాలతో ఇబ్బంది ఉండదు అని ముందుగానే సెట్ వేసారట. కథలో కీలకమైన సన్నివేశాలను ఈ సెట్ లో చిత్రీకరించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారట. అయితే ఆ సెట్ లో షూటింగ్ స్టార్ట్ కాకముందే షూటింగ్ నిలుపుదల చేసుకుంది.
కాగా ఇటీవల తెలంగాణా ప్రభుత్వం కూడా షూటింగులకు సూచనప్రాయంగా అనిమితించబోతున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగ్స్ స్టార్ట్ అయిన వెంటనే ఆల్రెడీ వేసిన సెట్ లో 'ఆచార్య' చిత్రీకరణ ప్రారంభించాలని అనుకున్నారట. అయితే అనుకోని అతిథిలా వచ్చిన వరుణుడు రెండు రోజుల నుండి వర్షం కురిపిస్తున్నాడు. ఈ వర్షాలకి 'ఆచార్య' కోసం వేసిన సెట్ మొత్తం సర్వనాశనం అయిపోయిందట. దీంతో ఈ సెట్ మరమ్మత్తుల కోసం రామ్ చరణ్ కి మళ్లీ ఖర్చు మీద ఖర్చు అవుతుందని.. పాపం ఇది 'ఆచార్య'కు దెబ్బ మీద దెబ్బ అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. అంతేకాకుండా 'ఆచార్య' మీద మొదటి నుండి కూడా చాలా నెగిటివ్ ప్రభావం ఉన్నట్లుగా అనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. ఏ ముహూర్తాన మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాను మొదలుపెట్టాడో కానీ.. ఈ సినిమాకు అడుగుడున గండాలు ఎదురువుతున్నాయని మెగా అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి హీరోయిన్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొదట త్రిష అనుకుంటే చివరికి ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ వచ్చి చేరింది. ఇప్పుడు ఈ సెట్ నాశనం అవడం.. ఇలా అనుకోని అవాంతరాలు ఎదురవుతూ 'ఆచార్య'ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.