తెలంగాణలో బ్రహ్మోత్సవం సినిమాకు ఉదయం అదనంగా ఓ షో వేసుకోవడానికి అవకాశమిచ్చినందుకు నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నాడు. దీని వల్ల తొలి రోజు భారీ వసూళ్లు సాధించే అవకాశం వచ్చింది మహేష్ సినిమాకు. డే-1 రికార్డులు బద్దలవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. నైజాం వరకు ‘బాహుబలి’ కలెక్షన్లను దాటేసినా ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడంతా బాగానే ఉంది కానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనుకోని పెద్ద అవాంతరం వచ్చి పడింది. ఆ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న జిల్లాలన్నింటినీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
పరిస్థితి చూస్తుంటే వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గేలా లేవు. దీంతో ‘బ్రహ్మోత్సవం’ టీంలో టెన్షన్ మొదలైంది. మామూలు వర్షాలైతే పెద్దగా ఇబ్బందేమీ లేదు కానీ.. ఇవి అలా కనిపించట్లేదు. ఎడతెరపి లేకుండా వానలు పడుతుండటంతో జనాలు థియేటర్లకు రావడం కష్టమయ్యేలా ఉంది. తొలి రోజు కలెక్షన్లకు పెద్దగా ఢోకా లేకపోవచ్చేమో కానీ.. ఈ వర్షాల్లో తర్వాతి రోజు నుంచి జనాలు థియేటర్లకు రావడానికి ఇబ్బంది పడొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన ఈ సినిమాకు ఆ వర్గం ప్రేక్షకులే దూరమయ్యే ప్రమాదం ఉంది. వేసవిలో మాంచి టైమింగ్ చూసి రిలీజ్ చేసిన సినిమాకు ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. దీంతో వర్షాలు ఆగిపోవాలని బ్రహ్మోత్సవం టీం.. మహేష్ అభిమానులు దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. మరి వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి.