తెలుగులో 'డీ ఫర్ దోపిడీ' అనే చిత్రాన్ని నిర్మించిన దర్శకద్వయం రాజ్ నిడిమోరు & కృష్ణ డీకే.. ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఇక 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షాహీద్ కపూర్ తో ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు రాజ్ & డీకే. అయితే యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి డి2ఆర్ ఇండీ అనే ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ లో రూపొందిన ఫస్ట్ మూవీ ''సినిమా బండి'' మే 14 నుండి నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ప్రవీణ్ కందిరేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వసంత్ మరింగంటి రచన చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ - 'బావిలోన కప్ప' సాంగ్ విశేష స్పందన తెచ్చుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో రాజ్ & డీకే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
''సినిమా బండి ఒక సింపుల్ స్టోరీ. కానీ దర్శకుడు ప్రవీణ్ మియు రచయిత వసంత్ ఒక ఫ్లిప్ బుక్ లో బొమ్మలతో మొత్తం కథను రెడీ చేసుకొచ్చారు. వాళ్లకి ఉన్న ప్యాషన్, వాళ్ళు చేసిన హోమ్ వర్క్ మాకు నచ్చింది. దీంతో 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తో రమ్మని చెప్పాం దానికి వాళ్ళు 40 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తో వచ్చారు. మాకు చెప్పిన దాంట్లో 80% చేయగలిగారు. స్క్రిప్ట్ ఇంకాస్త మెరుగు పరచడానికి మేము హెల్ప్ చేశాం. నేచురల్ అండ్ రా గా ఉండాలని కోరుకున్నాం. ఇది నిజాయితీ మరియు మంచి భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ప్రేక్షకులకు అది కచ్చితంగా నచ్చుతుంది'' అని రాజ్ & డీకే చెప్పారు.
తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసినా ఖచ్చితంగా అంగీకరించేవారని అనుకుంటున్నామని.. థియేటర్స్ లో విడుదల చేసే అవకాశం ఉంటే చేసేవాళ్ళమని దర్శకద్వయం తెలిపారు. 'ఫ్యామిలీ మ్యాన్ 2' లో సమంత అక్కినేని నటించడం గురించి మాట్లాడుతూ.. ''మేము ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మేము ప్రామిస్ చేసినట్లే ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 'సూపర్ డీలక్స్' లో సమంత బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసింది. అది చూసి మేము ఆమెనే అనుకున్నాము. సామ్ కూడా ఉత్సాహంగా చేయడానికి ఒప్పుకుంది. ఆమె మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది'' అని రాజ్ - డీకే చెప్పుకొచ్చారు.
ఇంకా రాజ్ & డీకే మాట్లాడుతూ.. ''హైదరాబాద్ లోనే మా జర్నీ స్టార్ట్ అయుంది. తెలుగులో ఎప్పుడో సినిమా చేయాల్సింది. కానీ వర్కౌట్ అవలేదు. మా దగ్గర రెండు స్క్రిప్ట్ లు రెడీగా ఉన్నాయి. త్వరలో తెలుగులో సినిమా మేము ఎదురు చూస్తున్నాము. ప్రస్తుతం షాహిద్ కపూర్ తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాం. అలానే హాలీవుడ్ రూస్సో బ్రదర్స్ నిర్మించే మరో పెద్ద వెంచర్ చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టుతో వాళ్ళు భారతీయ ఓటీటీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు'' అని వెల్లడించారు.