రాజ్ కందుకూరి తనయుడి సెకండ్ ఫిలిం ఫిక్స్
ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం టాలీవుడ్ లో చాలా కామన్. హీరోల తనయులే కాకుండా నిర్మాతల తనయులు కూడా హీరోగా తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ 'పెళ్ళిచూపులు' నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. శేష సింధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న శివ కందుకూరి డెబ్యూ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నెలాఖరుకు పూర్తవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కాకముందే శివ కందుకూరి హీరోగా మరో సినిమాకు సైన్ చేయడం విశేషం. ఈ సినిమాను 'RX100' సినిమాకు అజయ్ భూపతి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన P. భరత్ కుమార్ తెరకెక్కిస్తాడు.
శివ కందుకూరి ఫిబ్రవరి 18 న తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కొత్త సినిమా ప్రకటన రానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తారట. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడు.. ఈ సినిమాను ఆపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్. శ్రీనివాస్ రెడ్డి.. పుట్టాకర్ రోన్సన్ నిర్మిస్తారు.