అదృష్టం అనేది కూడా చావు లాంటిదే ఎందుకంటే అది కూడా ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కాకపోతే అదృష్టం లాంటి ఛాన్స్ వస్తుందని తెలిసినా ఎక్కడో చిన్న ఆలోచన దాన్ని దరికి రానివ్వకుండా ఆపేసి ఆ తర్వాత ఎందుకు వదిలేసుకున్నానురా దేవుడా అనేలా చేస్తుంది. ఇప్పుడు అదే తరహాలో ఓ నిర్మాత బాధపడుతున్నాడని అందరు అంటున్నారు. కానీ ఆ నిర్మాత మాత్రం లైట్ తీసుకుంటున్నాడు.
ఒకప్పుడు యాక్టర్ గా చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా ప్రొడ్యూసర్ గా మారాడు రాజ్ కందుకూరి. పెల్లి చూపులు సినిమాకు కూడా ఈయన కో-ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు. నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. అయితే ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త పాఠాలు నేర్పుతున్న అర్జున్ రెడ్డి కథ మొదటి ఈయన దగ్గరికే వచ్చిందట. దర్శకుడు సందీప్ ఏడాది క్రితం రాజ్ కి కథ చెప్పాడట. కానీ అతను మాత్రం కొన్ని కమిట్ మెంట్స్ వల్ల ఒప్పుకోలేకపోయాడట. అయితే సినిమా మాత్రం తప్పకుండా విజయం సాదిస్తుందని మాత్రం చెప్పాడట. అర్జున్ రెడ్డి తప్పకుండా ఒక ఆర్జీవీ తీసిన శివ సినిమాలాగే ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందని కూడా చెప్పాడట కానీ ఎందువల్లనో గాని సినిమాను నిర్మించే ఛాన్స్ వదిలేసుకున్నాడు.
ప్రస్తుతం అర్జున్ రెడ్డి హవా మాములుగా లేదు అంటూ.. చిత్ర యూనిట్ సబ్యులకు విషెస్ ని తెలిపాడు. ఇక వారు భవిష్యత్తు లో కూడా మంచి సినిమాలు తియ్యాలని రాజ్ కందుకూరి కోరుకున్నాడు.