'హిట్ అండ రన్..' ఈ పేరు చెప్పగానే సల్మాన్ ఖాన్ గుర్తొస్తాడు. ఇప్పుడు అలాంటి కేసు ఒకటి నమోదైంది. బైకును, ఆటోను ఢీకొట్టి వెళ్లిపోయింది ఒక కారు! రంగంలోకి దిగిన పోలీసులు ఆ కారు ఎవరిదని ఆరాతీస్తే.. దారి మళ్లీ బాలీవుడ్ వైపే చూపించింది! అవును.. ఆ కారు బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాది! మరి, కారు నడిపింది ఎవరు? వీళ్లిద్దరిలో ఒకరా? అసలు ప్రమాద సమయంలో వీరిలో ఒక్కరైనా కారులో ఉన్నారా? ఇదే హాట్ టాపిక్ గా మారింది.
బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు.. ఆటో, బైక్ ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్, బైక్ నడుపుతున్న వ్యక్తి గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆధారాలు సేకరించడానికి సంఘటనా స్థలానికి వెళ్లారు. చుట్టుపక్కల ఉన్న షాపుల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. పారిపోయిన కారు ఆధారం దొరికింది. అది Audi R8 కారు. బండి నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించారు. విషయం తెలుసుకొని నివ్వెర పోయారు పోలీసులు.
అవును.. ఆ కారు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పేరు మీద రిజిస్టరై ఉంది. విచారణ మరింత వేగవంతమైంది. శిల్పాశెట్టి, ఆమె భర్త బెంగళూరు వచ్చారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. రాలేదని తేలింది. అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత రాజ్ కుంద్రాను లైన్లోకి తీసుకున్నారు పోలీసులు!
'పలానా నెంబరు గల కారు మీదేనా..?' అని అడిగితే.. అవును అని చెప్పారు కుంద్రా. విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. దీంతో పోలీసులకు అంతా క్లియర్ అయినట్టు అనిపించింది. కానీ.. ఆ వెంటనే ట్విస్ట్ ఇచ్చారు కుంద్రా. 'ఆ కారు నాదే కానీ.. నాలుగు నెలల క్రితమే దాన్ని అమ్మేశాను'అని చెప్పారు. దీంతో.. ఈ సారి అవాక్కవడం పోలీసుల వంతైంది.
డీటెయిల్స్ తీసుకున్న పోలీసులు మళ్లీ బెంగళూరులో విచారణ సాగించారు. ఎట్టకేలకు ఆ కారు కొనుగోలు చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అతని పేరు మోహమ్మద్ సద్దాం. పలానా రోజు.. పలానా చోట ఈ కారుతో యాక్సిడెంట్ చేసింది నువ్వేనా? అని అడిగారు పోలీసులు. తల దించుకున్న సద్దాం.. అవునంటూ తలూపాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు శిల్పాశెట్టి దంపతులు. కానీ.. కథ అంతటితో అయిపోలేదు.
కారు అతనెవరో కొనుగోలు చేసినప్పటికీ.. ఇంకా రాజ్ కుంద్రా పేరుమీదనే ఉంది మరి! కాబట్టి లీగల్ గా నిందితులు వీరే అవుతారు. ఈ యాక్సిడెంట్ కేసులో చట్టం శిక్షించాల్సి వస్తే.. రాజ్ కుంద్రా కూడా దోషి అవుతారు. ఇదెక్కడి తలనొప్పిరా దేవుడా.. అనుకుంటూ ఈ కేసు నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారట కుంద్రా దంపతులు. ఒక్కోసారి అలా ఉంటుంది మరి! అందుకే.. బీ కేర్ ఫుల్. అండ్ బీ ప్రాక్టికల్!