'మహాభారతం' .. విస్తృతమైన కథావస్తువు కలిగిన ఇతిహాసం. 'మహాభారతం'లో పెద్ద సంఖ్యలో పాత్రలు కనిపిస్తాయి ... ప్రతి పాత్రకి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి మహాభారతాన్ని కథా వస్తువుగా తీసుకుని గతంలో కొంతమంది దర్శకులు సినిమాలు చేశారు.
అలాగే అర్జునుడు .. కర్ణుడు .. భీష్ముడు వంటి పాత్రలను ప్రధానంగా చేసుకుని సినిమాలు తీశారు. అలా చేసిన సినిమాలు దాదాపు విజయవంతమయ్యాయి. ఆ కథావస్తువులో ఉన్న బలమే అందుకు కారణమని చెప్పచ్చు. ఈ జనరేషన్ కి తగినట్టుగా మహాభారతాన్ని కొన్ని భాగాలుగా అందించాలని దాసరి అనుకున్నారుగానీ కుదరలేదు.
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ జనరేషన్ లో పౌరాణికాలు తీసేవారు లేరని చాలామంది అనుకున్నారు. కానీ రాజమౌళి 'మగధీర' సినిమా చేసిన తరువాత, అందరి దృష్టి ఆయనపైకి మళ్లింది.
'బాహుబలి' తరువాత ఆయనపై నమ్మకం కుదిరింది. రాజులు .. రాజ్యాలు .. అందుకు సంబంధించిన సెట్స్ .. కాస్ట్యూమ్స్ .. పాత్రల రూపకల్పన .. యుద్ధానికి సంబంధించిన వ్యూహాలు .. ఇలా అన్నింటిలో ఆయనకి ఉన్న అవగాహన చూసిన తరువాత, రాజమౌళి 'మహాభారతం' చేయగలరు అనే బలమైన విశ్వాసం అందరిలో కనిపించింది.
'మహాభారతం' చేస్తే ఒక వైపున కథాకథనాలు .. మరో వైపున గ్రాఫిక్స్ ను కలిపి నడిపించవలసి ఉంటుంది. ఎక్కడెక్కడ గ్రాఫిక్స్ అవసరం ఏ మేరకు ఉంటుందనేది తెలియాలి. ఆ అవగాహన రాజమౌళికి కావలసినంత ఉంది. ఇక 'మహాభారతం' తెరకెక్కించడం తన డ్రీమ్ అని రాజమౌళి చెప్పిన దగ్గర నుంచి , ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒక సందర్భంలో ఆయన ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు. అంతటి కథాకథనాలను తెరపై ఆవిష్కరించడానికి తనకి మరింత సమయం అవసరమవుతుందని ఆయన చెప్పారు.

మరో మూడు .. నాలుగు సినిమాలు చేసిన తాను 'మహాభారతం' చేయవచ్చని అన్నారు. అంటే అందుకు తగిన అనుభవం అప్పటికి వస్తుందనేది ఆయన ఆలోచన. అంటే రాజమౌళి 'మహాభారతం' ప్రాజెక్టును మొదలుపెట్టడానికి పదేళ్లు పట్టొచ్చని అనుకోవచ్చు.
ఇక కర్ణుడు పాత్రను ప్రధానంగా చేసుకుని .. కథానాయకుడిగా ప్రభాస్ ను తీసుకుని ఆయన 'మహాభారతం' చేయవచ్చనే ఊహాగానాలు షికారు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలోనే ముందుకు వెళ్లనుంది.