దిల్ రాజు చిన్న సినిమా తీసినా అది పెద్ద చిత్రాల స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటుంది. వాటిని ఆయన ప్రమోట్ చేసే విధానం... విడుదల చేసే తీరు పెద్ద సినిమాలకి ఏమాత్రం తీసిపోదు. చేతిలోనే డిస్ర్టిబ్యూషన్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆయన సినిమాలన్నీ పెద్ద స్థాయిలోనే విడుదలవుతుంటాయి. అయితే కొన్నిసార్లు వ్యూహాత్మకంగా చిన్న చిత్రాల్ని మొదట తక్కువ థియేటర్లలోనే విడుదల చేస్తుంటారు. మౌత్ టాక్ వచ్చాక ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలనుకొంటుంటారు. ఆ విషయాన్ని వేడుకల్లో కూడా చెబుతుంటారు.
అయితే లవర్ విషయంలో మాత్రం ఆయన అవేవీ చెప్పకపోగా - సినిమా కూడా తక్కువ థియేటర్లలోనే విడుదలవుతోందని సమాచారం. పబ్లిసిటీ విషయంలో కూడా ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఒకెత్తు - `లవర్` ఒకెత్తు అన్నట్టుగా ఉంది పరిస్థితి. తన సంస్థలో తెరకెక్కుతున్న ఇతరత్రా సినిమాల హడావుడిలో ఉంటూ `లవర్` విషయంలో కాస్త తక్కువగానే చొరవ తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. పైగా వేడుకల్లో ఆయన చెప్పిన మాటలు కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సినిమాని చేయడం ఒకెత్తు - చేయించడం ఒకెత్తు అన్నారు దిల్ రాజు. ఈ సినిమాని ఆయన అన్న సోదరుడు హర్షిత్ రెడ్డి నిర్మించిన విషయం తెలిసిందే. సినిమా వెనకుంటూ చేయించడమే చాలా కష్టమైన పని అనీ - మన అభిరుచులు... వాళ్ల అభిరుచులు వేరుగా ఉంటాయని ఇటీవల వేడుకలో దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఆయన మాటల్నిబట్టి అర్థమయ్యేదేంటే హర్షిత్ రెడ్డి అభిరుచులకీ - తన అభిరుచులకీ మధ్య వ్యత్యాసం ఉందని! ఈ పరిస్థితుల మధ్య తెరకెక్కిన `లవర్` ఎలా ఉంటుందో చూడాలి మరి. రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని అనీష్ కృష్ణ తెరకెక్కించారు.