కుర్ర హీరో రాజ్ తరుణ్ స్పీడ్ చూస్తుంటే రవితేజ గ్రాఫ్ ని టచ్ చేసేట్టే ఉన్నాడు. తెలివితేటలున్నాయ్ - స్పీడుంది - చొరవా ఉంది. వరుసగా హిట్లు కూడా వచ్చేస్తున్నాయ్. ఇంకేం ఉంది కెరీర్ ని మెరుపు వేగంతో తీర్చిదిద్దుకునే ఛాన్సుంది మరి. అందుకే అతడి అడుగులు కూడా వేగంగా నే పడుతున్నాయి. ఉయ్యాల జంపాల సినిమాతో తొలి విజయం అందుకుని, ఆ వెంటనే సినిమా చూపిస్త మావ అంటూ మరో పెద్ద విజయం అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా కుమారి 21 ఎఫ్ చిత్రంతో 20 కోట్ల క్లబ్ సినిమాలో నటించేశాడు.
అతడికి తొలి రెండు సినిమాల టైటిళ్లు చాలా కలిసొచ్చాయి. వినగానే టకీమని గుర్తు పట్టే టైటిళ్లు అవి. వాటిని హిట్ సాంగ్స్ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు అదే అతడికి సెంటిమెంట్ అయిపోయింది. హిట్ సాంగ్స్ నుంచి టైటిళ్లు తీసుకుంటే సూపర్ హిట్ లు కొట్టడం సులువే అని పట్టుపడుతున్నాడు. లేటెస్టుగా అతడి నాలుగో సినిమా టైటిల్ కూడా ఓ హిట్ సాంగ్ నుంచి కాపీ కొట్టేసింది. శుభ సంకల్పం సినిమాలోని సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు లిరిక్ నే ఈసారి టైటిల్ గా పెట్టేసుకున్నాడు.
హిట్టు మీద హిట్టొస్తుంటే.. మునుముందూ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తాడనడంలో సందేహమేం లేదు. రాజ్ తరుణ్ వరుస బావుంది. పోయెటిక్ గా ఉండే టైటిళ్లను - సాహిత్యం నుంచి తీసుకోవడం అలవాటైంది. ఇది అరుదైన విషయమే అయినా మెచ్చదగినది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు సంతకాలు చేసేందుకు రెడీ అవుతున్నాడుట. వాటికి కూడా ఇలాంటి టైటిళ్లనే ఎంపిక చేసుకుంటాడేమో. చూద్దాం.