మెగాస్టార్ చిరంజీవి ని విపరీతంగా అభిమానించి ఆయన స్ఫూర్తితో పరిశ్రమకు వచ్చిన తారలు ఎందరో ఉన్నారు. వీళ్లందరిలో రాజా రవీంద్ర కూడా ఒకరు. సీనియర్ నటుడిగా .. మేనేజర్ గానూ అతడు అందరికీ సుపరిచితుడు. ఇక చిరు అంటే ఎంతటి అభిమానం ఉన్నా అతడు ఆచార్య సెట్లో అన్నయ్యతో తిట్లు తిన్నాడట. దీనిని చాలా సంబరంగా చెప్పుకుంటున్నాడు.
``అన్నయ్య నాకెంతో క్లోజ్.. అయినా సరే ఎప్పుడు సమయం దొరికినా ఆయన్ని తదేకంగా అలాగే చూస్తాను. ఆచార్య షూటింగ్‌లో అన్నయ్య ఎదురుగా కూర్చుని అలాగే చూస్తున్నాను. దరిద్రం ఎన్నిసార్లు చెప్పినా వీడు అలా చూడటం మానడు అని తిట్టాడు. నేను నవ్వాను... ఎందుకు నవ్వుతున్నావు? అని అడిగితే మీరు తిట్టినా బాగుంటుంది అని చెప్పాను. దానికాయన కర్మ.. వెళ్లి అక్కడ కూర్చో అన్నాడు. నిజంగానే ఆయనకు ఇబ్బందిగా ఉంటుంది.. కానీ నాకు బాగుంటుంది`` అని అన్నారు.
చిరు నటించిన చాలా సినిమాల్లో రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఉత్తేజ్ - రవితేజ- శ్రీకాంత్ సహా రాజా రవీంద్ర అన్నా చిరుకు అభిమానం. ఇకపోతే రాజా రవీంద్ర అన్నయ్య చిత్రం ఆచార్యలో అవకాశం అందుకున్నారు. సెట్లో తన అనుభవాన్ని చెప్పారిలా. చిరంజీవి అన్నయ్యకు విపరీతమైన పరిణతి ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడినప్పుడు కామెడీగా అంటున్నామా? కావాలని అంటున్నామా? అనేది ఆయనకు ఇట్టే తెలిసిపోతుంది. అలా ఓసారి నాకు ఆచార్య షూటింగ్ లో తిట్లు పడ్డాయి అంటూ పై సంగతులు చెప్పుకొచ్చారు.