సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఆయన సూసైడ్ కి కారణం ఏమిటో బయటకు రాలేదు. సీనియర్ నటుడుగా ఎంతోమందితో పని చేసిన ఆయన.. ఏ రోజూ ఎవరితోనూ గొడవ పడింది లేదని చెబుతారు. అందరిని కలుపుకుపోయే తత్వం ఉన్న ఆయన.. ఒక్క వ్యక్తితో మాత్రమే వివాదం ఏర్పడిందని చెబుతారు.
శాంతినికేతన్ సీరియల్ లో నటించే సమయంలో.. ఒక సీన్లో రంగనాథ్ ఎక్స్ ప్రెషన్ సరిగా లేదని.. ఆ సీరియల్ కు దర్శకత్వం వహించిన రాజమౌళి (ఇప్పటి జక్కన్న) అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి రంగనాథ్ మాత్రం తాను చేసింది కరెక్టేనని చెప్పారు. దీంతో.. రాజమౌళి ఒక్కసారిగా కోపం వచ్చి ‘‘విల్ గో ఫర్ నెక్ట్స్ సీన్’’ అంటూ అన్నారు. దీంతో.. కోపం వచ్చిన రంగనాథ్ ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు ఇద్దరూ మామూలుగానే పని చేసుకున్నారు.
ఆ సందర్భంలో రాజమౌళితో రంగనాథ్ చెప్పిందేమంటే.. ‘‘నీకు మంచి భవిష్యత్తు ఉంది. వచ్చిన అవకాశాల్ని నిలబెట్టుకో’’ అంటూ చెప్పినట్లుగా రంగనాథ్ చెప్పేవారు. తనకు నటుడిగా సంతృప్తినిచ్చిన సీరియల్ శాంతినికేతన్ గా చెబుతారు. పరిశ్రమలో తొలి వివాదం.. ఆఖరి వివాదం అదేనని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు.