మటల్లేవ్‌ మాట్లాడుకోడాల్లేవ్‌.. ఓన్లీ విజువల్స్‌

Update: 2015-08-10 16:40 GMT
బాహుబలి భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సరికొత్త ఫార్మాట్‌ లో తెరకెక్కిన సినిమా. ఇదో విజువల్‌ వండర్‌. ఈ చిత్రంలో డైలాగ్స్‌ కి ప్రాధాన్యత శూన్యం. అయితే ఇలా చేయడానికి రీజన్‌ ఏంటి? అన్నదానికి రాజమౌళి ఓ చిట్‌ చాట్‌ లో ఇలా చెప్పుకొచ్చారు.

''డైలాగ్స్‌ సీజన్‌ ముగిసింది. భవిష్యత్‌ విజువల్‌ టెల్లింగ్‌ దే. డైలాగ్స్‌ నోమోర్‌ అని అన్నారు రాజమౌళి. పరుచూరి సోదరులు రెండు దశాబ్ధాల పాటు డైలాగ్స్‌ తోనే పరిశ్రమని ఏలారు. వారి ప్రభావం అసాధారణమైనది. మన దర్శకులందరిచేతా డైలాగ్స్‌ చేతే స్టోరీ చెప్పించేవారు. వారి బలమే డైలాగ్‌. అంతకంటే ముందే కె.వి.రెడ్డి, బాపు, విశ్వనాథ్‌ వంటివారు విజువల్‌ టెల్లింగ్‌ లో సినిమాని చూపించేవారు. కానీ పరుచూరి బ్రదర్స్‌ వచ్చాక డైలగ్‌ ఏలింది. ఆ తర్వాత నాన్న(విజయేంద్ర ప్రసాద్‌)గారు వచ్చారు. ఆయన విజువల్‌ టెల్లర్‌. కథల్ని విజువల్స్‌ లోనే రాసుకుంటారాయన. అలా రాసుకున్న కథల్ని డైలాగ్‌ తో చెప్పించే ప్రయత్నం చేస్తే సక్సెస్‌ రాలేదు..'' అని తెలిపాడు జక్కన్న.

కంటిన్యూ చేస్తూ.. ''ఆ తర్వాత వర్మ, మణిరత్నం సీజన్‌ మొదలైంది. అదీ వెళ్లాక కొత్త జనరేషన్‌ లో పూరి, వినాయక్‌, తేజ, నేను వచ్చాం. మేమంతా విజువల్‌ నేరేషన్‌ కే ప్రాధాన్యతనిచ్చాం. అప్పటికి నాన్నగారి కథలు బైటికొచ్చాయి. అవన్నీ పాపులర్‌ అయ్యాయి. లక్కీగా నేను నాన్నగారి దగ్గర అసిస్టెంట్‌ రైటర్‌ గా పనిచేశా. మా ఇద్దరి స్టయిల్‌ ఒకటే. డ్రమటిక్‌ ఆలోచనలు కలుస్తాయి. అందుకే మా కలయిక క్లిక్కవుతోంది'' అని చెప్పాడు.

తన తండ్రి గురించి మరిన్ని విషయాలు చెబుతూ.. ''వాస్తవానికి నాన్న జన్మతః రచయిత కాదు. నిర్మాత అవ్వాలని పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత ఏదో ఒకటి చేసి బతకాలి కాబట్టి రైటర్‌ అయ్యారు. అప్పట్లోనే పెదనాన్న ఘోస్ట్‌ రైటర్‌ గా పనిచేసేప్పుడు నాన్నగారు ఆయనతో కలిసి పనిచేసేవారు. దత్త బ్రదర్స్‌ పేరు తో కథలు రాసేవారు. నాన్న హాలీవుడ్‌ ప్రియుడు కాబట్టి ఆ అనుభవంతో అనాలిసిస్‌ చేసి కథలు పుట్టించేవారు. అదీ సంగతి'' అని చెప్పారు జక్కన్న.

భవిష్యత్‌ అంతా ఇక విజువల్‌ టెల్లర్స్‌ దేనని డిక్లేర్‌ చేశారు రాజమౌళి. వింటున్నారా అప్‌ కమింగ్‌ డైరెక్టర్స్‌?
Tags:    

Similar News