బాహుబలి సాధించిన ఘనతను కళ్లారా చూసుకున్నారు మరకతమణి కీరవాణి. ఈ సినిమా ఆన్ సెట్స్ ఉండగానే ఇదే చివరి చిత్రం. ఇక సినిమాలకు పనిచేయను. జీవితంలో ఇంకా చాలా ఉన్నాయ్. వాటిపై శ్రద్ధ పెట్టదలిచానని కీరవాణి ప్రకటించారు. ఇక ఎం.ఎం.కీరవాణి లేకుండానే బాహుబలి 2 చిత్రం తరువాత రాజమౌళి పనిచేయబోతున్నారని అందరికీ అర్థమైంది. సంచలన విజయాన్ని ఆస్వాధించి ఇక కీరవాణి వెళుతున్నారు కాబట్టి ఆ స్థానాన్ని బర్తీ చేసేదెవరు? అన్న ఆసక్తికర చర్చ సాగుతోందిప్పుడు.
మరో సోదరుడు కళ్యాణి మాళిక్ రాజమౌళి తో కలిసి పనిచేస్తున్నారని వార్తలొస్తున్నా.. అవకాశం దేవీశ్రీ ప్రసాద్ కి కూడా ఉందని అనుకుంటున్నారు. ఒకవేళ అనూహ్యంగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరుని పరిశీలించే అవకాశాన్ని కొట్టి పారేయలేమని చెబుతున్నారు. రాజమౌళి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్. పైగా దేవీ ఇప్పటికే హైస్టాండార్డ్స్ లో టెక్నాలజీ తో పనిచేశాడు. కాబట్టి అతడికే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు.
కొందరు క్రిటిక్స్ ఏ.ఆర్.రెహమాన్ ని రంగంలోకి దించితే బెటర్ అంటున్నారు. రెహమాన్ ఇప్పటికే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్. పైగా క్రియేటివిటీ లో అసాధారణం అన్న పేరుంది. రాజమౌళి స్ఠాయి సినిమాలకు అతడు ఇచ్చే ఆర్.ఆర్ అసాధారణంగా ఉంటుంది. అంతర్జాతీయ స్టాండార్డ్స్ లో ఉంటాయి. చూద్దాం జక్కన్న ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే.