బాహుబలి 2 ట్రైలర్ యూట్యూబ్ రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేస్తోంది. ట్రైలర్ ఆన్ లైన్ లో రిలీజ్ అయ్యి.. పట్టుమని పది గంటలు కూడా కాకముందే.. ఇప్పటికే కోటి వ్యూస్ దాటిపోయాయి. మరోవైపు ఇప్పటికే 3.6 లక్షల లైక్స్ తో సెన్సేషన్స్ సృష్టించేసింది. ఇదంతా ఒక్క తెలుగు వెర్షన్ రికార్డ్ మాత్రమే. అన్ని భాషల్లోనూ కలిపితే ఈ రికార్డ్ ఇంకా అల్లంత దూరంలో ఉంటుంది.
ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా.. దర్శకధీరుడు రాజమౌళి అనేక సంగతులు చెప్పాడు. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ లీక్ కాకుండా ఉండేందుకు 4 క్లైమాక్స్ లు చిత్రీకరించారనే టాక్ ఉంది. దీనికి స్పందించిన రాజమౌళి.. ఒక్క క్లైమాక్స్ ను పూర్తి చేసేందుకే చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు. ఇక నాలుగు క్లైమాక్స్ లను చిత్రీకరించడం అంటే సామాన్యమైన విషయం కాదని.. అలాంటిదేమీ లేదని చెప్పేశాడు జక్కన్న. తొలి భాగం సక్సెస్ కారణంగా.. రెండో పార్ట్ కు భారీగా మార్పులు చేయడంపై కూడా రియాక్ట్ అయ్యాడు రాజమౌళి.
యుద్ధ సన్నివేశాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం తప్ప.. మూల కథలో కానీ.. కేరక్టర్స్ లో కానీ ఏ మాత్రం మార్పులు చేయలేదన్న జక్కన్న.. తొలిభాగం పూర్తయ్యేనాటికే రెండో భాగానికి సంబంధించి 30 శాతం షూటింగ్ పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/