రాజమౌళికే అసూయ పుట్టించిన దర్శకుడు..

Update: 2018-05-14 12:38 GMT
దర్శక ధీరుడు, బాహుబలి రూపశిల్పి.. రాజమౌళి.. బాహుబలిలోని ప్రతీ ఫేమును అందంగా తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అంతటి రాజమౌళి ఓ సినిమాను అభినందించాడు. కానీ ఫ్లాప్ అవుతుందనుకున్న సినిమా ఇంతలా హిట్ అయ్యేసరికి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

మహానటి మూవీని అల్లు అర్జున్, అల్లు అరవింద్ లు తాజాగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, కీరవాణి సహా చాలా మంది ప్రముఖ దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. వారందరి సమక్షంలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాంక, స్వప్నలను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి ఆసక్తికరంగా స్పందించాడు..

రాజమౌళి మాట్లాడుతూ.. ‘మహానటి తీస్తున్నారనగానే నాకసలు అంచనాలే లేవు. ఈ సినిమా హిట్ అవుతుందని అనుకోలేదు.. కానీ చూశాకే తెలిసింది. ఇది ఇండస్ట్రీ స్థాయిని పెంచే సినిమా అని.. ప్రతి అంశం, రాసిన విధానం, ఆర్టిస్టుల నటన అన్నీ అద్భుతంగా వచ్చాయి. ఈ క్రెడిట్ అంతా నాగ్ అశ్విన్ దే.. సావిత్రి, జెమినీ గణేషన్ మధ్య ప్రేమ పుట్టుక, చివరకు సావిత్రితో విభేదాలు, మందు తాగే అలవాటు అయ్యే సీన్ సినిమాకే హైలెట్.. వీటన్నింటిని చాలా పొయేటెక్ గా సెటిల్ గా తీర్చిదిద్దిన అశ్విన్ కు హ్యాట్సాఫ్.. నాగ్ అశ్విన్ ను చూస్తుంటే నాకే అసూయ పుడుతోంది.. నేను కూడా ఇలాంటి సినిమా తీయలేనేమో’ అని అన్నాడట..

ఇలా రాజమౌళి చేతే ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.. ఎవ్వరికీ సాధ్యం కానీ బయోపిక్ ను తీసి సత్తా చాటాడు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న మహానటి తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా అందరూ భావిస్తున్నారు.
Tags:    

Similar News