యావత్ సినీ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రుధిరం రణం) ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' సినిమా తర్వాత రూపొందిస్తున్న సినిమా కావడం.. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమాలో 'అల్లూరి సీతారామరాజు'గా చరణ్ నటిస్తుండగా 'కొమరం భీమ్'గా తారక్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రామ్ చరణ్ ఇంట్రో వీడియో విశేషంగా ఆకట్టుకుంది.
కాగా స్వాతంత్యం కోసం పోరాడిన విప్లవ వీరుల పాత్రలతో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రాజమౌళి దేశభక్తిని నెక్స్ట్ లెవల్ లో చూపించబోతున్నాడని తెలుస్తోంది. రాజమౌళి గత చిత్రాల వలె గూస్ బమ్స్ వచ్చేలా ఆ సీన్స్ డిజైన్ చేసారని సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అజయ్ దేవగన్ ఎపిసోడ్ హైలైట్ గా నిలవనుందట. అంతేకాకుండా 'ఆర్.ఆర్.ఆర్' లో ఎన్టీఆర్ - చరణ్ ల మధ్య ఫ్రెండ్ షిప్ ని ప్రధాన అంశంగా చూపించబోతున్నారట. కొమరం భీమ్ - అల్లూరి ల మధ్య స్నేహబంధాన్ని ఎలివేట్ చేస్తూ ఇప్పటికే కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్ ని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ అద్భుతంగా పిక్చరైజేషన్ చేసారని తెలుస్తోంది. ఇక యాక్షన్ సీన్స్ కూడా ఒళ్ళు గగుర్పొడిచేలా ఉండబోతున్నాయట. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ జరుపుకున్న 'ఆర్.ఆర్.ఆర్' కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. పరిస్థితులు అనుకూలించిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసే వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.