బాహుబలి అంటే రాజమౌళి. జక్కన్న తీసేదే బాహుబలి.. మరి అలాంటప్పుడు బాహుబలికి దర్శకుడు ఎలా మారతాడని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పింది పేరు మార్పు గురించేనండీ. దర్శకుడు మారాడని కాదు. బాహుబలి తీసిన వ్యక్తి రాజమౌళి అయితే.. బాహుబలి2 రిలీజ్ అయ్యే నాటికి మన జక్కన్న పద్మశ్రీ రాజమౌళి అయిపోతున్నాడు. ఈ ఏడాదికి కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో రాజమౌళి కూడా ఉన్నాడు.
ఈ టాలీవుడ్ దర్శకుడికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ ఇచ్చి సత్కరించింది. ఓటమి ఎరుగని ఏకైక దర్శకుడిగా టాలీవుడ్ లో సత్తా చాటుతున్నాడు జక్కన్న. స్టార్ హీరోల పేర్లు చెప్పుకుని సినిమాలు తీయాల్సిన, చూడాల్సిన సమయంలో.. దర్శకుడి పేరుతో థియేటర్ కు రప్పించగలగడం అనే ట్రెండ్ ని క్రియేట్ చేశాడు రాజమౌళి. ఆయన సినిమా చివర్లో వేసే ఒక్క స్టాంప్ చాలు.. మూవీకి ఆడియన్స్ ను రప్పించడానికి. ఓ సినిమా తీయడం కోసం.. బడ్జెట్ ని కంట్రోల్ చేసుకోవాలేమో కానీ.. రాజమౌళి తీస్తాను అంటే చాలు వందల కోట్లు పోసేయడానికైనా నిర్మాతలు రెడీ అంటున్నారంటే.. రాజమౌళి అందుకున్న స్థాయి అర్ధమవుతుంది.
ఇంతటి ఖ్యాతి గడించిన రాజమౌళికి.. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. అయితే.. ఇది ప్రారంభమే నని.. త్వరలో పద్మభూషణ్ - విభూషణ్ కూడా అందుకునే సత్తా రాజమౌళికి ఉందని.. తెలుగు సినీ అభిమానలు అంటున్నారు.