జపాన్ లో జక్కన్న ఎంత హ్యాపీగున్నాడో

Update: 2018-04-27 13:13 GMT

బాహుబలి సిరీస్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంతగా మెప్పించిందో మనకు తెలుసు. ఇతర దేశాల్లో కూడా ఈ సినిమా బాగానే సక్సెస్ అయింది కానీ.. అన్ని దేశాలదీ ఒక లెక్క అయితే.. జపాన్ లెక్క మాత్రం మరోలా ఉంది. ఇక్కడి జనాలు మరీ వెర్రెత్తిపోయారు. బాహుబలి మూవీలో ప్రతీ ఒక్క క్యారెక్టర్ ను ఓన్ చేసేసుకున్నారు. మన దేశంలోనే 100 రోజులు ఆడని సినిమాని.. అక్కడ హండ్రెడ్ డేస్ తర్వాత కూడా ఇంకా ఇరగదీసేస్తోంది బాహుబలి.

తన చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన జపాన్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు.. వారితో కలిసి గడిపేందుకు నేరుగా జపాన్ వెళ్లిపోయాడు రాజమౌళి. అక్కడి ప్రేక్షకులతో కాసేపు గడిపాడు. ఆ సమయంలో చేతిలో ఫ్లాగ్స్ పట్టుకుని.. రోబోస్ మాదిరిగా బాహుబలి అంటూ అరుస్తూ జపాన్ ప్రేక్షకులు ఇచ్చిన గౌరవం మాత్రం.. జక్కన్నకు జీవితకాలం గుర్తుండిపోయే విషమయే. పైగా ఒక్కరు కూడా సీట్ లో నుంచి లేవకుండా.. చూపించిన క్రమశిక్షణ కూడా అభినందనీయం.

'బాహుబలి2 చిత్రాన్ని దిగ్విజయం చేసిన జపాన్ లోని టోక్యోలో అభిమానులతో కలిసి గడపడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రేమ హద్దులను దాటిపోయింది. చాలా సంతోషకరమైన రోజు' అంటూ అక్కడి ఆడియన్స్ తో కలిసి తీసుకున్న సెల్ఫీ వీడియోతో పాటు రాజమౌళి చేసిన ట్వీట్ ఇంకా ఆకట్టుకుంటోంది.
Tags:    

Similar News