ఈసారి మరింత అడ్వాన్స్‌డ్‌ గా జక్కన్న

Update: 2018-11-23 17:12 GMT
రాజమౌళి ఏం చేసినా చాలా డెప్త్‌ కు వెళ్లి మరీ చేస్తాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా మొదలు పెట్టడానికి ముందే ప్రతి సీన్‌, ప్రతి ఫ్రేమ్‌ ను పర్‌ ఫెక్ట్‌ గా ప్లాన్‌ చేసుకునే జక్కన్న తాజాగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ మల్టీస్టారర్‌ కు కూడా అదే విధంగా ప్లాన్‌ చేశాడట. ‘బాహుబలి’ చిత్రంకు ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకు వాడని విజువల్‌ ఎఫెక్ట్‌ ను వాడి, విజువల్‌ వండర్‌ గా చిత్రాన్ని తీర్చిదిద్ది బాలీవుడ్‌ వారిని కూడా ఆశ్చర్యపర్చిన జక్కన్న మరోసారి ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచే విధంగా మల్టీస్టారర్‌ చిత్రంలో కొత్త రకం టెక్నాలజీని వాడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఆర్‌ మల్టీస్టారర్‌ చిత్రంలో యాక్షన్‌ సీన్స్‌ చాలా కీలకంగా ఉంటాయట. ఆ సీన్స్‌ చిత్రీకరణ కోసం అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న కెమెరాలను జక్కన్న సినిమాటోగ్రఫర్‌ సెంథిల్‌ తో వాడిస్తున్నాడట. యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ కోసం 120 కెమెరా రిగ్‌ సెటప్‌ ను ఇంపోర్ట్‌ చేసుకున్నారట. ఈ సెటప్‌ తో ఒక సీన్‌ ను 360 డిగ్రీల పరిధిలో చిత్రీకరించే అవకాశం ఉంటుంది. దాంతో పాటు 3డిలో కూడా చిత్రీకరణ చేయవచ్చట. 3డి కళ్లద్దాలు లేకుండానే 3డి మూవీ చూసిన ఫీలింగ్‌ కలిగేలా జక్కన్న ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

బాహుబలి తర్వాత చేయబోతున్న సినిమాకు పెద్దగా గ్రాఫిక్స్‌ వాడటం లేదని చెప్పిన జక్కన్న గ్రాఫిక్స్‌ లేకుండా కెమెరాతోనే విజువల్‌ వండర్‌ ను క్రియేట్‌ చేయబోతున్నాడనిపిస్తుంది. ఎన్టీఆర్‌ - రామ్‌ చరణ్‌ ల అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివారులోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. జక్కన్న సృష్టించబోతున్న ఈ కొత్త అద్బుతాన్ని చూడాలంటే 2020 వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News