మరో వారంలో థియేటర్లలో సందడి చేయనున్న బాహుబలి 2 మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసిందే. నెలల తరబడి జక్కన్న చెక్కిన శిల్పం కోసం సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కన్నడ సంఘాలు కొన్ని రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటివరకూ స్పందించని రాజమౌళి తాజాగా రియాక్ట్ అయ్యారు. విడుదల డేట్ దగ్గర పడుతున్న కొద్దీ బాహుబలి 2ను బ్యాన్ చేయాలంటూ కర్ణాటకలో ఆందోళనలు అంతకంతకూ పెరుగుతుండటంతో జక్కన్న సీన్లోకి వచ్చేశారు.
అప్పుడెప్పుడో కావేరీ జల వివాదంలో తమిళుల పక్షాన నిలిచిన కట్టప్ప పాత్రధాని సత్యరాజ్.. కన్నడిగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉంటూ.. బాహుబలి 2ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. వందల కోట్ల పెట్టుబడి పెట్టిన ఈ సినిమా ఏ ఒక్క వెర్షన్ లో రిలీజ్ ఆగినా..నిర్మాతలకు వాటిల్లే నష్టం అంతా ఇంతా కాదు. దీంతో.. జక్కన్న తాజాగా కన్నడంలో ఒక స్పీచ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఒకటిన్నర నిమిషం కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ.. అందరికి నమస్కారమని.. తనకు కన్నడ రాదని..కాబట్టి తప్పుగా మాట్లాడితే క్షమించాలంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
కట్టప్ప పాత్రధాని సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు తొమ్మిదేళ్లు అయ్యాయని.. అతనికి ఈ సినిమాకు సంబంధం లేదన్నారు. అతను సినిమాల్లో ఉన్న చాలామంది నటుల్లో ఒకరు మాత్రమే తప్పించి.. ఈ సినిమాకు అతనేం దర్శకుడు.. నిర్మాత కాదన్నారు. అతనికి.. సినిమాకు సంబంధం లేదని.. అతని వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. తమ సినిమాలో చాలామంది నటుల్లో అతను ఒకరు మాత్రమేనని.. ఈ సినిమా మీద ఎన్నోకుటుంబాలు ఆధారపడి ఉన్నాయని.. వేలాది మంది జీవితాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. సత్యరాజ్ కు ఈ సినిమాకు సంబంధం లేదన్న రాజమౌళి.. బాహుబలి 1ను ఆదరించిన రీతిలోనే తాజా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలో ఏం ఉందంటే..
"అందరికీ నమస్కారం. కన్నడ మాట్లాడం సరిగా రాదు. తప్పులుంటే క్షమించండి. సత్యరాజ్ గారికి సంబంధించిన వివాదం గురించి నేను.. మా ప్రొడ్యూసర్స్ మీకు ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. కొన్నేళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు మీలో చాలామందికి మనో వేదనను గురి చేసి ఉంటాయి. కానీ.. వాటికి.. మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం సత్యరాజ్ గారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఒక నెల ముందు ఈ అంశం మీద వీడియో చూసే వరకూ మాకు ఈ విషయం గురించి తెలియదు. ఆయన వ్యాఖ్యలు చేసి తొమ్మిదేళ్లు అవుతోంది.
ఈ కాలంలో ఆయన చాలా సినిమాల్లో నటించారు. వాటిని కన్నడలో విడుదల చేశారు. బాహుబలి 1 కూడా కర్ణాటకలో విడుదలైంది. ఆ సినిమాను ఎలా ఆదరించారో తాజా చిత్రాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను. సత్యరాజ్ ఈ చిత్రానికి దర్శక.. నిర్మాతలేం కాదు. ఈ సినిమాలో నటించిన ఎంతోమంది నటుల్లో ఆయన ఒకరు మాత్రమే.
ఈ సినిమా విడుదలను ఆపేస్తే ఆయనకు వచ్చే నష్టమేమీ ఉండదు. ఆయన ఒక్కరు చేసిన వ్యాఖ్యల వల్ల ఇంత మంది ప్రభావితం కావటం.. వారి మీదున్నకోపాన్ని బాహుబలి సినిమా మీద చూపించటం సరికాదు. ఇప్పటికే ఈ విషయం మీద ఆయనతో ఫోన్ చేసి మాట్లాడాం. అంతకుమించి మేం చేయగలిగిందేమీ లేదు. మాకు ఏ విధంగానూ సంబంధం లేని అంశం ఇది. ఈ ఇష్యూలోకి మమ్మల్ని లాగొద్దని ఆర్థిస్తున్నాను. బాహుబలి 1ని ఆదరించిన రీతిలోనే బాహుబలి 2నుకూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను"
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/