‘బాహుబలి’ చూసిన కన్నులతో రాజమౌళి తర్వాతి సినిమాను మరింత భారీతనంతో చూడాలని ప్రతి ప్రేక్షకుడూ ఆశించడం సహజం. తన ప్రతి సినిమాను అంతకుముందు సినిమా కంటే మిన్నగా తీయాలని తపించే రాజమౌళి.. ‘బాహుబలి’ తర్వాత దాన్ని మించిన విజువల్ వండర్ తోనే వస్తాడని అంతా అనుకుంటున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఈసారి విజువల్ ఎఫెక్ట్స్.. గ్రాఫిక్స్ లాంటివేమీ లేని మామూలు సినిమా తీయాలని కోరుకుంటుండటం విశేషం. సరదాకి అన్నాడో.. సీరియస్సో కానీ.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రాజమౌళి ఈ మేరకు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి.
‘బాహుబలి: ది కంక్లూజన్’కు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా పని చేసిన కమల్ కణ్ణన్ ను ఉద్దేశించి రాజమౌళి స్పందిస్తూ.. ‘‘నా తర్వాతి సినిమా ఇతడి సాయం లేకుండా చేయాలనుంది. అందుకే నా తర్వాతి సినిమాకు గ్రాఫిక్స్ అవసరం లేకుండా ప్లాన్ చేస్తా’’ అని రాజమౌళి అన్నాడు. కమల్ కణ్ణన్ తొలిసారి రాజమౌళితో ‘మగధీర’కు పని చేశాడు. ఆ తర్వాత ‘ఈగ’కు కూడా అతడి సాయం తీసుకన్నాడు జక్కన్న. ఐతే ‘బాహుబలి: ది బిగినింగ్’కు మాత్రం శ్రీనివాస్ మోహన్ లైన్లోకి వచ్చాడు. ఐతే అతను ‘రోబో-2’ కోసం వెళ్లిపోవడంతో కమల్ కణ్ణన్ ‘ది కంక్లూజన్’లోకి వచ్చాడు. ‘మగధీర’ తర్వాత చాలా సింపుల్ గా ‘మర్యాదరామన్న’ తీసిన రాజమౌళి.. ఈసారి కూడా అదే తరహాలో నిజంగానే ఓ మామూలు సినిమా తీయాలని అనుకుంటుంటే ఆశ్చర్యమేమీ లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/