మ‌హాభార‌తం జ‌క్క‌న్న‌, రామాయ‌ణం ప్ర‌భుదేవా

Update: 2015-09-20 07:30 GMT
ఇటీవ‌లే బాహుబ‌లి సినిమాతో ఘ‌న‌విజ‌యం అందుకున్న జ‌క్క‌న్న ఓ మాట చెప్పాడు. మ‌హాభార‌తం లాంటి ఎపిక్‌ ని సినిమాగా తీసి తీర‌తాన‌ని అన్నాడు. అది త‌న చిర‌కాల కోరిక అంటూ ప్ర‌క‌టించాడు. ఇంత‌లోనే మ‌రో ద‌ర్శ‌కుడు కం కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవా త‌న మ‌న‌సులోని మాట‌ని బైట‌పెట్టాడు. స‌రైన నిర్మాత దొరికితే రామాయ‌ణంను తెర‌కెక్కించాల‌ని ఉంది.

ఈ పురాణేతిహాసం ఇన్‌ స్పిరేష‌న్‌ తోనే హాలీవుడ్‌ లో లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ తెర‌కెక్కించారు. మ‌నం తీస్తే త‌ప్పేంటి? అని ప్ర‌భుదేవా అన్నాడు. అయితే ఇలాంటి సినిమాలు తీయాలంటే మ‌న‌కి బ‌డ్జెట్ ప‌ర‌మైన స‌మ‌స్య‌లొస్తాయ్‌. భారీ ఖ‌ర్చ‌వుతుంది. అంత పెట్టే నిర్మాత దొరికితే తీయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పాడు. అంతేకాదు .. అమితాబ్‌ - ర‌జ‌నీకాంత్ లాంటి స్టార్ల‌ తో సినిమాలు చేయాల‌నుంద‌ని చెప్పాడు.
 
రాజ‌మౌళి - ప్ర‌భుదేవా వ‌రుస చూస్తుంటే ఇద్ద‌రూ ఒకేసారి మ‌హాభార‌తం - రామాయ‌ణం సినిమాల్ని తెర‌కెక్కించేట్టే క‌నిపిస్తున్నారు. రాజులు - రాజ్యాలు - కోట‌లు - గుర్రాలు - సైన్యం ఇలా అన్నీ ఈ రెండిటికీ పోలిక‌లు ఉన్నాయి... కాబ‌ట్టి  సెట్ ప్రాప‌ర్టీని - జూనియ‌ర్ ఆర్టిస్టుల్ని షేర్ చేసుకుని ఒకేసారి సినిమా తీస్తారేమో చూడాలి. తీస్తే బాగానే ఉంటుంది. బాహుబ‌లి - రుద్ర‌మ‌దేవి 3డి త‌ర్వాత మ‌ళ్లీ మ‌హాభార‌తం - రామాయ‌ణం సినిమాలే సంచ‌ల‌నాలు అవుతాయి.
Tags:    

Similar News