టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఏం చేసినా కూడా ప్రత్యేకంగా ఉంటుంది అనడం లో సందేహం లేదు. ఆయన సినిమాలను ఏ విధంగా మార్కెట్ చేస్తాడు అనేది అందరికి తెల్సిందే. ఆయన సినిమా ప్రమోషన్ పద్దతులు అత్యంత విభిన్నంగా ఉంటాయి. ఆయన సినిమా అంటేనే అద్బుతం అన్నట్లుగా ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో సినిమాపై అంచనాలు మరింతగా పెంచేలా మేకింగ్ వీడియోలు మరియు ప్రోమోలను విడుదల చేస్తూ ఉంటాడు. సినిమా ను పీక్స్ కు తీసుకు వెళ్లడానికి ట్రైలర్ ను చివర్లో విడుదల చేస్తాడు. రాజమౌళి సినిమా మేకింగ్ అంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే ఆయన ఇటీవల విడుదల చేసిన రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో చాలా పెద్దగా ఉంటుంది. ఇటీవల విడుదల అయిన రోర్ ఆఫ్ ఆర్ ఆర్‌ఆ ర్ అనేది చిన్న టీజర్ మాత్రమే అని అసలు సినిమా మేకింగ్ ముందు ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం ఈ సినిమా కు సంబంధించిన మేకింగ్ వీడియోను ఒక డాక్యుమెంటరీగా ఓటీటీ లో విడుదల చేయబోతున్నారట. ఆ డాక్యుమెంటరీకి గాను సదరు ఓటీటీ భారీ మొత్తంను చెల్లిస్తున్నట్లుగా చెబుతున్నారు. సినిమా స్క్రిప్ట్ వర్క్ నుండి మొదలుకుని షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వరకు.. ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు విడుదల అన్ని విషయాలను కూడా డాక్యుమెంటరీలో చూపించబోతున్నారట.
సినిమా విడుదల అయిన తర్వాత కొన్ని రోజులకు ఈ డాక్యుమెంటరీ విడుద లచేస్తారా లేదా ముందే విడుదల చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. డాక్యుమెంటరీ గా సినిమా మేకింగ్ ను తీసుకు రావడం ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు జరిగి ఉండదు. కనుక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కు మాత్రమే ఈ అరుదైన ఘనత దక్కింది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో ఈ సినిమా ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాహుబలి 2 సినిమా ను మించిన వసూళ్ల ఈ సినిమాకు వస్తాయనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ ఇతర పంపిణీ హక్కులకు సంబంధించిన బిజినెస్ జరిగింది. సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ను ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా కోసం ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత జార్జీయాలో తుది షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. వచ్చే నెలతో సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
సినిమా ప్రమోషన్ సమయంలో జక్కన్న అనుసరించబోతున్న ప్లాన్స్ గురించి ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు. అక్షయ్ కుమార్ మరియు శ్రియ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను ఈ సినిమా లో సీతగా జక్కన్న చూపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇది ఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా గా నిలుస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. అందుకే ఈ సినిమా పై డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నారు.