ఏదైనా కొత్త సినిమా రావడం ఆలస్యం.. ఆ సినిమాలకు తన వంతు సాయం చేస్తుంటాడు రాజమౌళి. ఈ దర్శక దిగ్గజం ఇచ్చే ట్విట్టర్ రివ్యూలు కోసం చాలామంది వెయిట్ చేస్తారంటే చూస్కోండి మరి. మొన్ననే పెళ్ళి చూపులు సినిమా గురించి రివ్యూలు ఇచ్చిన రాజమౌళి.. ఇప్పుడు తన స్నేహితుడు యేలేటి తీసిన ''మనమంతా'' సినిమాపై తన ప్రశంసల జల్లు కురిపించాడు.
''మనమంతా సినిమా చందూ (చంద్రశేఖర్ ఏలేటి) జీవితంలో ఒక క్లాసిక్ లా మిగిలిపోతుంది. నటలు దగ్గర నుండి నటనను పిండుకోవడంలో చందూ నిష్ణాతుడు. మోహన్ లాల్ నుండి చిన్న పిల్లల పాత్రదారుల వరకు.. నవ్విస్తారూ ఏడిపిస్తారూ.. అలాగే మన గుండెల్లో చిరకాలం ఉండిపోతారు. ఏదో ఫిలిం స్టూడెంట్లకు ఒక పాఠ్య పుస్తకంలా.. సినిమా అలా మొదలై అలా ముగిసింది. ఈ సినిమాకోసం పనిచేసిన వారందరూ.. సగర్వంగా మేము మనమంతా సినిమాకు చేశాం అని చెప్పుకోవచ్చు'' అంటూ చెప్పాడు రాజమౌళి.
జక్కన్న ఇలాంటి సర్టిఫికేట్ జారీ చేశాడంటే ఇక జనాలు సినిమాలు చూడ్డానికి ఎగబడతారంతే. అది ఆయన మాటకు ఉన్న విలువ, పవర్, నమ్మకం.