ఇచ్చిన మాటకోసం నిల‌బ‌డిన రాజ‌మౌళి!

Update: 2023-01-19 12:30 GMT
ఇండస్ట్రీలో స‌క్సెస్ వ‌చ్చిందే స‌మీక‌ర‌ణాల‌న్నీ మారిపోతుంటాయి. ఫ్లాపుల్లో ఇచ్చిన మాట హిట్టొచ్చాక మారుతూ వుంటుంది. హిట్టొస్తే పాత వారిని ప‌ట్టించుకునే వారే వుండ‌రు. అంతా కొత్త వారి చూపు చూస్తుంటారు. కొత్త ప్రాజెక్ట్ ల‌ని సెట్ చేసుకోవాల‌ని లెక్క‌లు వేస్తుంటారు. స్టార్స్‌, స్టార్ డైరెక్ట‌ర్స్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. కానీ రాజ‌మౌళి మాత్రం ఇచ్చిన మాట కోసం ఖ‌చ్చితంగా నిల‌బ‌డ‌తానంటున్నారు. ప‌దేళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం సినిమా చేస్తానంటున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. ఇండ‌స్ట్రీలో ఇచ్చిన మాట ప్ర‌కారం నిల‌బ‌డే వాళ్లు చాలా త‌క్కువ మందే వుంటారు. అదీ పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుని హైట్స్ కి వెళ్లిన వాళ్లు ప‌దేళ్ల క్రితం ఇచ్చిన మాట‌ని గుర్తు పెట్టుకోవ‌డం అంటే ఊహించుకోవ‌డం క‌ష్టం. కానీ అలా ప‌దేళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నిల‌బ‌డుతున్న తీరు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇది ఆయ‌న క‌మిట్ మెంట్ కి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

`RRR`తో ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా క్రిటిక్స్ ఛాయిస్ సుర‌స్కారాల్లో ఏకంగా రెండు అవార్డుల‌ని సొంతం చేసుకుని హాలీవుడ్ సెల‌బ్రిటీల దృష్టిలో ప‌డింది. అంతే కాకుండా రాజ‌మౌళి పేరు కూడా హాలీవుడ్ ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌క దిగ్గ‌గ‌జాలు స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్‌, జేమ్స్ కెమెరూన్ ల దాకా తీసుకెళ్లింది. వారితో క‌లిసి సంభాషించే స్థాయికి చేర్చి యావ‌త్ దేశం మొత్తం ఆశ్చ‌ర్యంతో రాజ‌మౌళి వైపు చూసేలా చేసింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా, హాలీవుడ్ సెల‌బ్రిటీల్లోనూ క్రేజ్ ని సొంతం చేసుకున్న రాజ‌మౌళి త్వ‌ర‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తో ఓ భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ని తెర‌కెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీని గ‌త కొంత కాలంగా సినిమాల నిర్మాణానికి దూరంగా వుంటున్న దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్‌. నారాయ‌ణ‌కు చేయ‌బోతుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్  ని నిర్మించ‌డానికి హాలీవుడ్ కు చెందిన ప‌లు క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు ఆస‌క్తి చూపుతున్నా రాజ‌మౌళి మాత్రం ప‌దేళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం కె.ఎల్‌. నారాయ‌ణ‌కు చేయ‌బోతుండ‌టం గ‌మ‌నార్హం.

2006 నుంచి సినిమా నిర్మాణానికి దూరంగా వుంటూ వ‌స్తున్న దుర్గా ఆర్ట్స్ కు రాజ‌మౌళి ప‌దేళ్ల క్రితం మాట ఇచ్చార‌ట‌. ఇచ్చిన మాట కోసం రాజ‌మౌళి ఈ ప్రాజెక్ట్ ని దుర్గా ఆర్ట్స్ లో చేయ‌బోతున్నారు. ఇది ఆయ‌న నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసిన వాళ్లంతా ఈ విష‌యంలో రాజ‌మౌళిని మెచ్చుకుని తీరాల్సిందే అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News