వరుసగా పాన్ ఇండియా సినిమాలతో క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది ఆలియా. ఓవైపు బ్రహ్మాస్త్ర రిలీజ్ కి వస్తోంది. మరోవైపు ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ కి సిద్ధమవుతుండగా తన పార్ట్ పూర్తి చేయాల్సి ఉంది. ఈలోగానే కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో గంగూభాయి కతియావాడీ అనే భారీ పాన్ ఇండియా చిత్రంలోనూ ఆలియా నటిస్తోంది. తదుపరి రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ పాన్ ఇండియా మూవీలోనూ ఆలియా పేరే వినిపిస్తోంది.
ఇన్ని సినిమాల నడుమ ఆలియా గందరగోళానికి గురవుతోందని ఆర్.ఆర్.ఆర్ లో తన పాత్ర పరిధిని పెంచేసిన ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఆ సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతుంటే ఇబ్బంది పడుతోందని ప్రచారమవుతోంది. ఆ మేరకు ముంబై మీడియాలో వరుస కథనాలు వేడెక్కించాయి.
అయితే ఇది నిజమా? అంటే అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. నిజానికి ఆలియా పై కీలక భాగం చిత్రీకరణ పూర్తయింది. కేవలం చరణ్ - ఆలియా జంటపై ఒక పాట చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంది. దాని కోసం ఈ వారంతంలో ఆలియా ఆర్.ఆర్.ఆర్ టీమ్ తో జాయిన్ కావాల్సి ఉంటుంది. కానీ బాలీవుడ్ మీడియాలో వేరే రకంగా ప్రచారం సాగుతోంది. ఆలియాపై ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి చాలా షూటింగ్ పెండింగులో ఉందన్న కథనాలు వెలువడుతున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని ఇన్ సైడ్ సోర్స్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లూరి (చరణ్) సరసన సీతగా ఆలియా లుక్ ఇంతకుముందు రిలీజై అభిమానుల్ని ఆకట్టుకుంది.
మరోవైపు గంగూభాయి కతియావాడీ చిత్రీకరణలోనూ ఆలియా పాల్గొనాల్సి ఉండగా.. దర్శకుడు భన్సాలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆలియా స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. టెస్టుల రిపోర్ట్ వచ్చాక తనకు ఎలాంటి కరోనా సోకలేదని కూడా ఆలియా వివరణ ఇచ్చారు. కాబట్టి ఈ వారంతంలో ఆలియా ఆర్.ఆర్.ఆర్ టీమ్ తో జాయినవుతున్నారనే భావించాల్సి ఉంటుంది. అలాగే ఆలియాపై రూమర్స్ కి జక్కన్న టీమ్ అధికారికంగా చెక్ పెడుతుందేమో చూడాలి.