ఇంతకీ బాహుబలిలో దేవా కట్టా ఏం చేశాడు?

Update: 2015-07-14 17:21 GMT
దేవా కట్టా మంచి మాటల రచయిత అని అతడి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య లాంటి సినిమాల్లో అద్భుతమైన మాటలతో అదరగొట్టాడు. దేవా పెన్ పవర్‌ గురించి తెలుసుకుని రాజమౌళి అతడి సేవల్ని బాహుబలి సినిమాకు బాగానే ఉపయోగించుకున్నాడు. సినిమా మొదలవ్వడానికి ముందు దేవా కట్టాకు జక్కన్న థ్యాంక్స్ చెప్పడం చూసే ఉంటారు. ఐతే సినిమాలో అతడి ప్రమేయం ఏంటన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఐతే ట్విట్టర్ వేదికగా ఆ విషయాన్ని వెల్లడించాడు దేవా కట్టా.

సినిమాలో వార్ సీన్స్ సందర్భంగా ప్రభాస్‌కు కొన్ని డైలాగులు రాశానని.. ఐతే తాను చేసింది చాలా చిన్న సాయమే అని.. రాజమౌళి మాత్రం అది గుర్తుంచుకుని తనకు క్రెడిట్ ఇచ్చాడని ట్వీట్ చేశాడు దేవా కట్టా. ఈ రోజు తొలిసారి ట్విట్టర్లో సినిమాకు వస్తున్న రెస్పాన్స్ గురించి ట్వీట్ చేసిన రాజమౌళి.. దేవా కట్టాకు మరోసారి కృతజ్నతలు చెప్పాడు. దేవా టైమ్ లైన్‌కు వెళ్లి.. ‘‘మీరు రాసింది కొన్ని పదాలే. కానీ అవి అద్భుతంగా పేలాయి. ప్రేక్షకుల గుండె లోతుల్లోకి వెళ్లాయి’’అని ట్వీట్ చేశాడు రాజమౌళి. చేసింది చిన్న సాయమే అయినా కృతజ్నత మరిచిపోని రాజమౌళిని అభినందించాల్సిందే.
Tags:    

Similar News