జక్కన్న పునరాలోచనలో పడ్డాడా...?

Update: 2020-06-19 15:30 GMT
కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ కొన్ని గైడ్ లైన్స్ పాటిస్తూ షూటింగ్స్ చేసుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. దీంతో చిన్న పెద్ద సినిమాలు షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' పై పడింది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎలా నిర్వహిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆర్.ఆర్.ఆర్' కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ చేంజ్ చేసుకున్న ఈ మూవీ మరోసారి డేట్ మార్చుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీకి రావడం కష్టమే అని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ మధ్య ప్రభుత్వాల నుంచి షూటింగ్స్ అనుమతి వచ్చిన నేపథ్యంలో పరిమిత సిబ్బందితో అందుబాటులో ఉన్న నటీనటులతో చిత్రీకరణ స్టార్ట్ చేయాలని రాజమౌళి భావించారట. దీని కోసం ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఓ భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారట. అయితే భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా పరిమిత సిబ్బందితో తెరకెక్కించడం సాధ్యమేనా అని భావించిన రాజమౌళి ట్రయిల్ షూట్ చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ట్రయిల్ షూట్ మాత్రం జరకలేదట. దీనికి కారణం విదేశీ టెక్నీషియన్స్ పనిచేస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ అందుబాటులో ఉన్న సాంకేతిక నిపుణులతో పూర్తి చేయడం కుదిరేపని కాదని.. అంతేకాకుండా దీని వలన అనుకున్న అవుట్ ఫుట్ రాదని జక్కన్న ఆలోచిస్తున్నాడట. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకీ కరోనా కేసులు అధికమవుతుండటంతో కొద్దిరోజులు ఆగడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చాడని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.

కాగా 'ఆర్.ఆర్.ఆర్'లో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామ రాజు'గా కనిపిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Tags:    

Similar News