జక్కన్న కూడా వాట్సాప్‌ ఫ్యాన్!!

Update: 2017-04-22 10:02 GMT
ఇప్పుడు ఫోన్ లో సోషల్ మీడియా యాప్స్ లేని వారు ఉండరు అనీ మనం బల్ల గుద్ది మరీ చెప్పచ్చు. ఎందుకంటే అది రోజువారి అవసరాలలో భాగం కాబట్టి. ఒక సాధారణ మనిషి అవసరాలే ఇన్ని ఉన్నపుడు ఒక గొప్ప సెలబ్రిటీకి.. ఫిల్మ్ మేకర్ కి ఇంకా వీటి అవసరం ఎంతో ఉండవచ్చు కాదా.

బాహుబలి సినిమా ఎట్టకేలకు పూర్తి చేసుకొని ప్రమోషన్ పనులలో బిజీ గా ఉన్నారు రాజమౌళి అండ్ కో. ప్రమోషన్ పనిగా బాహుబలి టీమ్ అంతా మొత్తం దేశం చూడుతున్నారు. హింది - తమిళ్ - మలయాళం - తెలుగు  - కన్నడ ఇలా అన్నీ బాషలలో రావడం వలన వీళ్ళు అన్నీ ప్రాంతాలకు వెళ్లవలిసి వస్తుంది. బాహుబలి 2 ప్రమోషన్ కోసం చాలా మార్కెట్ పన్నాగాలు చేస్తున్న వీళ్ళను.. ముఖ్యంగా రాజమౌళిని.. ''మీరు సోషల్ మీడియా అప్స్ ఎంత విరివిగా వాడతారు?'' అని అడిగారు మీడియా వారు.

దానికి దానికి మన జక్కన సమాధానం చెబుతూ.. ''నేను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ను బాగా వాడుతున్నాను. ఇప్పుడు నా సినిమా టీమ్ తో డిస్కస్ చేయడానికి.. వి.ఎఫ్‌.ఎక్స్ వాళ్ళని ఫాలో-అప్ చేయడానికి ఇదే ఉపయోగపడుతోంది'' అని సెలవిచ్చాడు. ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్ అండ్ ట్విట్టర్ కంటే కూడా.. పనులు ఏమన్నా అవ్వాలంటే మాత్రం అందరూ వాట్పాప్ నే వాడుతున్నారు. చక్కగా గ్రూపులు పెట్టేసి వర్క్ విషయాలన్నీ డిస్కస్ చేస్తున్నారు. రాజమౌళి కూడా అదే రూట్లో ఉన్నాడనమాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News