రాజమౌళి ఈగ మరియు బాహుబలి సినిమాలు వీఎఫ్‌ఎక్స్ వర్క్ వల్ల నెలలకు నెలలు ఆలస్యం అయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా రెండు పార్ట్ లు కూడా చాలా నెలలు వాయిదా వేయాల్సి వచ్చంది. అందుకే జక్కన్న తన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు అలాంటి ఇబ్బంది కలుగకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి మొదటగా విజువల్ ఎఫెక్ట్ షాట్స్ ను చిత్రీకరిస్తున్నాడట. పలు దేశాల విఎఫ్‌ఎక్స్ కంపెనీలతో వర్క్ చేయించాల్సి ఉంది. కరోనా కారణంగా చాలా కంపెనీలు పూర్తి స్థాయిలో తమ కార్యకళాపాలను నిర్వహించడం లేదు. కనుక ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ వర్క్ ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
మొదట విఎఫ్‌ఎక్స్ షాట్స్ ను షూట్ చేసి ఇస్తే వాటి పనులు జరుగుతూ ఉంటాయి. ఇతర షూటింగ్ ను మెల్లగా నిర్వహించే ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే ఏడాది చివరి వరకు ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ప్రయత్నాలు జక్కన్న సీరియస్ గా చేస్తున్నాడు. జక్కన్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే ప్రారంభించాడు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటించడం వల్ల అనుకున్నంత స్పీడ్ గా షూటింగ్ కావడం లేదని టాక్. అయినా కూడా జక్కన్న మాత్రం వచ్చే ఏడాదికే ఫిక్స్ అయ్యాడట.