కొన్నేళ్ల కిందట మెగాస్టార్ చిరంజీవికి.. మరో సీనియర్ హీరో రాజశేఖర్ కు మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్న చిరంజీవిపై రాజశేఖర్-జీవిత విమర్శలు చేయడం.. మెగాస్టార్ అభిమానులు కొందరు వారిపై దాడికి ప్రయత్నించడం.. ఆపై చిరు రాజశేఖర్ ఇంటికి వెళ్లి వారికి సారీ చెప్పి పరామర్శించడం.. అయినప్పటికీ ఇద్దరి మధ్య దూరం పెరగడం.. ఇలా రకరకాల పరిణామాలు జరిగాయి. ఐతే అభిమానులు తప్పు చేస్తే చిరంజీవి మీద రాజశేఖర్ కోపం పెంచుకోవడం.. చిరు స్వయంగా వచ్చి సారీ చెప్పాక ఆయన మీద సరైన రీతిలో స్పందించకపోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
ఐతే ఈ విషయంలో చిరంజీవి మీద కోపం పెంచుకోవడానికి కారణాలు వేరే ఉన్నాయని రాజశేఖర్ అన్నాడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన అసలు విషయం చెప్పడానికి సిద్ధమయ్యారు. ఐతే పక్కనే ఉండి ప్రతి విషయంలోనూ రాజశేఖర్ బ్రీఫింగ్ ఇస్తూ ఉన్న జీవిత ఆయనకు చెక్ పెట్టేశారు. ఈ విషయం చెప్పాల్సిందే అంటూ రెడీ అయిన రాజశేఖర్.. జీవిత వారించడంతో ఇలాంటివి వద్దులెండి అంటూ ఆగిపోవడం గమనార్హం. తన తల్లి చనిపోయాక జీవితం శాశ్వతం కాదు అని తనకు అర్థమైందని.. ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండటం.. ఎవరినీ ఇబ్బంది పెట్టకపోవడం మంచిదని అనిపిస్తోందని.. ఎప్పుడో జరిగిందాని గురించి ఇప్పుడు మాట్లాడి మళ్లీ ఎవరినీ బాధపెట్టడం.. కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం తనకు ఇష్టం లేదని.. అందుకే ఆ విషయాన్ని వదిలేద్దామని చెప్పి వేరే టాపిక్ మీదికి వెళ్లిపోయాడు రాజశేఖర్.