భార్యాభర్తలు కావడానికి ముందు రాజశేఖర్-జీవిత కలిసి ‘తలంబ్రాలు’.. ‘అంకుశం’.. ‘ఆహుతి’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఐతే దాని కంటే ముందు వీళ్లిద్దరూ కలిసి ఓ తమిళ సినిమాలో నటించాల్సిందట. ఐతే ఆ సినిమాకు జీవిత సూటవ్వదని తాను అన్నందుకు తనను ఆ సినిమా నుంచి తప్పించేసినట్లు రాజశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
నేను ‘హలో యారు పేసర్దు’ అనే తమిళ సినిమా షూటింగులో తొలిసారి జీవితను కలిశా. ఆ సినిమా నిర్మాత.. దర్శకుడు నా దగ్గరికొచ్చి హీరోయిన్ గా జీవిత ఎలా ఉంది అని అడిగారు. ఐతే ఆ సినిమాలో కథానాయిక పాత్రకు జీవిత సూటవ్వదేమో అనిపించింది. అదే విషయం వాళ్లకు చెప్పా. ఆశ్చర్యకరంగా మరుసటి రోజు షూటింగ్ నుంచి నా కోసం కారు రాలేదు. నన్ను షూటింగుకే పిలవలేదు. నన్ను ఆ సినిమా నుంచి నన్ను తీసేశారని తెలిసింది. ఆ తర్వాత జీవితతో కలిసి ‘తలంబ్రాలు’ సినిమా చేశాను. అంతకుముందు నన్ను సినిమా నుంచి తీసేయడం గురించి ఆమె దగ్గర ప్రస్తావించాను. అప్పుడు హీరోగా నా గురించి ఆమెను అభిప్రాయం అడిగారని.. తాను పాజిటివ్ గానే చెప్పిన్పటికీ వాళ్లు తీసేశారని చెప్పింది. అప్పుడర్థమైంది.. నేను జీవితను వద్దు అనుకుంటే.. ఆమె మాత్రం నన్ను కావాలనుకుందని.. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ‘ఆహుతి’.. ‘అంకుశం’ లాంటి సినిమాలు చేశాం. మేం కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. తర్వాత పెళ్లి చేసుకున్నాం’’ అని రాజశేఖర్ తెలిపాడు.