హీరో కూతురి ఎంట్రీకి కథ సిద్ధం

Update: 2018-01-23 15:01 GMT
కాలం చాలా మారుతోంది అనడంలో కొన్ని ఉదాహరణలు స్టాంపు గుద్దినట్లు గుర్తుచేస్తున్నాయి. ఎప్పుడు స్టార్ హీరోల కుమారులే హీరోలు అవ్వాలా కుమార్తెలు హీరోయిన్స్ అవ్వరా? అనే ప్రశ్న అప్పట్లో బాగా వినిపించేది. కానీ ఏ హీరో అలాంటి సాహసం చేసేవారు కాదు. ఎందుకో అందరికి బాగా తెలిసే ఉంటుంది. అయితే ఈ రోజుల్లో మాత్రం అలా లేదు. అన్ని తెలుసు కాబట్టి మహిళలు కూడా చాలా దైర్యంగా ముందుకు సాగుతుండడంతో నటి నటులు వారి కుమార్తెలను కూడా వెండితెరపై రనించాలని కోరుకుంటున్నారు.

ఇప్పటికే అలా వచ్చిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లో రాజశేఖర్ - జీవిత కుమార్తెలు కూడా సినిమాల్లో హీరోయిన్స్ గా కొనసాగనున్నారు. గత కొంత కాలంగా ఈ వార్తలు  వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా పెద్ద పాప శివని ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఓ కథ కూడా ఫిక్స్ అయ్యింది. హీరో మరెవరో కాదు. ఎన్నారై నుంచి హీరో క్యాటగిరికి షిఫ్ట్ అయిన అడివి శేష్. ఈ మధ్య శేష్ ప్రయోగలతో మంచి హిట్స్ అంసుకుంటున్నాడు. అయితే త్వరలో వివి.వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన వెంకట్ రెడ్డి తెరకెక్కించేబోయే రొమాంటిక్ లవ్ స్టోరీలో అడివి శేష్ - శివని ప్రధాన జంటగా కనిపించబోతున్నారు.

బాలీవుడ్ లో హిట్ అయిన 2 స్టేట్స్ సినిమాకు ఈ సినిమా అఫీషియల్ రీమేక్. అలియా భట్ అర్జున్ కపూర్ ఆ సినిమాలో నటించి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అదే తరహాలో శివని - శేష్ గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు. మరి ఆ సినిమా వారికి ఏ స్టయిలో హిట్ అందిస్తుందో చూడాలి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్న ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ కానుంది.


Tags:    

Similar News