హీరో రాజశేఖర్ నెల రోజుల క్రితం కరోనాతో సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. జీవిత.. శివాని మరియు శివాత్మికలు కూడా కరోనా పాజిటివ్ అంటూ వెళ్లడయ్యినా వారు వెంటనే కోలుకున్నారు. కాని గత నెల రోజులుగా రాజశేఖర్ కరోనాతో సఫర్ అవుతున్నారు. ఆయన ఒకానొక సమయంలో ఆయన తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన ఎట్టకేలకు కరోనా ను జయించాడు. నెల రోజులుగా సిటీ న్యూరో ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రాజశేఖర్ ఎట్టకేలకు డిశ్చార్జ్ అయ్యారు.
నేడు ఆసుపత్రి వైధ్యులకు మరియు స్టాఫ్ అందరికి రాజశేఖర్ దంపతులు మరియు శివాని మరియు శివాత్మికలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రి స్టాఫ్ తో ఫొటోలు దిగడం పాటు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. రాజశేఖర్ గారి కోసం సిటీ న్యూరో వైధ్యులు తీవ్రంగా కృషి చేశారంటూ జీవిత రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన ఆరోగ్యం విషయమై గత కొన్ని రోజులుగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయన పూర్తి ఆరోగ్యంతో బయట పడ్డారు. మరి కొన్ని రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైధ్యులు రాజశేఖర్ కు సూచించారట. నేడు రాజశేఖర్ కరోనాను జయించి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవ్వగా మరో వైపు చిరంజీవి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో క్వారెంటైన్ కు వెళ్లడం జరిగింది. త్వరలోనే చిరంజీవి కూడా కరోనాను జయించాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
Full View Full View Full View