రాజ‌శేఖ‌ర్ సినిమాకు ఎట్ట‌కేల‌కూ మోక్షం..ఈ వారంలోనేనా!

Update: 2020-03-03 08:15 GMT
ఒక సినిమా షూటింగ్ పూర్తి అయిన తొమ్మిదేళ్ల త‌ర్వాత విడుద‌లు అవుతోందంటే.. అదొక వింత కిందే లెక్క‌! 2011 లో రూపొంది, అప్పట్లోనే షూటింగ్ తో స‌హా అన్ని కార్య‌క్ర‌మాల‌నూ పూర్తి చేసుకున్న ఒక సినిమా ఈ వారంలో విడుద‌ల కాబోతోంద‌ట‌. ఆ క్రెడిట్ ను పొందుతూ ఉంది రాజ‌శేఖ‌ర్ సినిమా అర్జున. ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ డ్యూయ‌ల్ రోల్ చేశాడ‌ట‌. త‌మిళ ద‌ర్శ‌కుడు క‌న్మ‌ణి ఈ సినిమాను రూపొందించాడు. ఇప్పుడు కాదు.. తొమ్మిదేళ్ల కింద‌ట‌!

అప్ప‌ట్లో రాజ‌శేఖ‌ర్ ఫామ్ లో లేడు. దీంతో మొత్తం పూర్తి అయినా ఈ సినిమాను విడుద‌ల చేయ‌లేక‌పోయిన‌ట్టుగా ఉన్నారు. అయితే పీఎస్వీ గ‌రుడవేగ విడుద‌లై హిట్ అయ్యాకా.. ఈ సినిమా విష‌యంలో క‌ద‌లిక వ‌చ్చింది. ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేశారు. అయితే అయినా దీనికి మోక్షం  క‌లిగిన‌ట్టుగా లేదు!

గ‌త ఏడాది కూడా ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా ప‌లు ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి. అయితే సినిమా మాత్రం థియేట‌ర్ల వ‌ద్ద‌కు రాలేదు. అయితే ఈ నెల ఆరో తేదీన ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా తాజాగా ప్ర‌క‌టించారు.  ఈ సినిమా ప్ర‌మోష‌న్ ను రాజ‌శేఖ‌ర్ కూడా ప‌ట్టించుకుంటున్న‌ట్టుగా లేడు. ఇది విడుద‌ల అయినా కాక‌పోయినా రాజ‌శేఖ‌ర్ పెద్ద‌గా ఫీల‌య్యేది ఏమీ లేన‌ట్టుంది.

ఇది పొలిటిక‌ల్ సెటైర్ అని, ఏకంగా ఎనిమిది వంద‌ల స్క్రీన్ల మీద ఈ సినిమాను ఈ ఈవారంలోనే విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా నిర్మాత‌లు ప్ర‌క‌టించారు! తొమ్మిదేళ్ల కింద‌టి సినిమా ఇప్పుడు ఇన్ని థియేట‌ర్ల‌లో అంటే కూడా వింతే. ఇంత‌కీ ఈ వారం అయినా ఈ సినిమా విడుద‌ల ఉంటుందా అనేది మాత్రం ఇంకా మిస్ట‌రీనే కావొచ్చు!
Tags:    

Similar News