మల్లూ గడ్డ.. అల్లు అర్జున్ అడ్డా..!

అందుకే పుష్ప 2 సినిమాకు కొచ్చిలో ఊహించిన దాని కన్నా భారీ క్రేజ్ ఏర్పడింది.

Update: 2024-11-28 09:31 GMT

డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ క్రేజ్ తెలిసిందే. పాట్నా నుంచి మొదలు పెట్టి ఇటు చెన్నై అటు కొచ్చిలో కూడా పుష్ప 2 ఈవెంట్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా బుధవారం కొచ్చిలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. అసలే కేరళలో అల్లు అర్జున్ కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులోనూ పుష్ప 1 తో సూపర్ హిట్ కొట్టి పుష్ప 2 విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. అందుకే పుష్ప 2 సినిమాకు కొచ్చిలో ఊహించిన దాని కన్నా భారీ క్రేజ్ ఏర్పడింది.

అల్లు అర్జున్ కెరీర్ మొదటి నుంచి మల్లు ఫ్యాన్స్ అతనికి సపోర్ట్ గా నిలిచారు. అతను చేసిన ఆర్య సినిమా నుంచి అతన్ని అభిమానిస్తున్నారు. అందుకే పుష్ప 2 ఈవెంట్ లో తనపై చూపిస్తున్న మళయాలీల ప్రేమ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు అల్లు అర్జున్. తన ఆర్మీ ఇక్కడ నుంచే మొదలైందని.. తనను ఆర్య నుంచి అభిమానిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపాడు అల్లు అర్జున్. తనను అందరు ఇక్కడ మల్లు అర్జున్ చేసుకున్నారని.. మీ ప్రేమ తన సొంతమని అన్నాడు.

మలయాళీల మీద ప్రేమలో ఈ సినిమాలో ఒక సాంగ్ ను అన్ని భాషల్లో మలయాళ వెర్షన్ ఉంచామని చెప్పి ఫ్యాన్స్ లో జోష్ నింపాడు అల్లు అర్జున్. 3 ఏళ్లుగా ఈ సినిమా గురించి వెయిట్ చేయించానని ఇక మీదట స్పీడ్ గా సినిమాలు చేస్తానని అన్నాడు అల్లు అర్జున్. మళయాలంలో తన ఫ్యాన్ బేస్ గురించి తెలుసు కాబట్టే అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్ ని అక్కడ భారీగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో సాంగ్ ని కూడా మళయాల లిరిక్స్ ఉండేలా చేయడం కూడా ఆ భాషకు ఆయన ఇస్తున్న రెస్పెక్ట్ అని చెప్పొచ్చు.

ఇదే ఈవెంట్ లో రష్మిక మందన్న కూడా డ్యాన్స్ వేసి మరీ మళయాల ఆడియన్స్ మీద తన ప్రేమ ఏంటో చూపించింది. పుష్ప 1 లోని సామీ సామీ సాంగ్ కు ఆమె డ్యాన్స్ చేసింది. అల్లు అర్జున్ సర్ కి ఇక్కడ క్రేజ్ చూసి తనకు నోట మాటరావట్లేదని అన్నారు. ఈ ప్రేమకు ఆయన అర్హులని అన్నారు రష్మిక. ఇక ఇది కొచ్చినా లేక హైదరాబాదా అన్నట్టుగా ఉందని. తప్పకుండా ప్రేక్షకులను అలరించేలా పుష్ప 2 ఉంటుందని నిర్మాతలు అన్నారు.

Tags:    

Similar News